BigTV English

Super Stars: డూపు వాడని హీరోల్లేరు… ఇక్కడ అందరూ సర్వమంగళ మేలమే

Super Stars: డూపు వాడని హీరోల్లేరు… ఇక్కడ అందరూ సర్వమంగళ మేలమే

Super Stars: సినిమా అనేది ఓ కలల ప్రపంచం. ఇందులో మనం తెరపై చూసే ప్రతి యాక్షన్ సీన్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా, భారీ యాక్షన్ సీక్వెన్సులు, ప్రమాదకరమైన స్టంట్లు, ఫైట్లు—all these require special expertise. అందుకే సినిమా పరిశ్రమలో స్టంట్ డూప్స్‌ ఉపయోగించడం చాలా సాధారణం. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలయ్యాక సినిమాలని త్వరగా పూర్తి చేయడానికి, బడ్జట్ కంట్రోల్ చేయడానికి, ఆర్టిస్టులకి రిస్క్ తగ్గించడానికి ఈ డూప్స్ వాడకం మరింత పెరిగింది. అవసరాన్ని బట్టి కొన్ని సార్లు బాడీ డబుల్స్, కొన్ని సార్లు డూప్స్ ని వాడడం అనేది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నదే. ఇందులో ప్రేక్షలులని మోసం చేయడం లాంటి విషయమేమీ లేదు కానీ కొంతమంది ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా, హీరో డూప్ వాడాడని సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు.


ఇటీవల, ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా నుంచి ఓ BTS వీడియో లీకైంది. అందులో ప్రభాస్ స్థానంలో డూప్ యాక్షన్ సీన్ చేస్తున్నట్లు కనిపించడంతో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ప్రభాస్ ఏమీ చేయలేదు మొత్తం దూప్ తో లాగేసారు అంటూ యాంటీ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలుపెట్టారు. ఇది ఇంటర్నెట్ సెన్సేషన్ అవ్వడంతో… ప్రభాస్ ఫాన్స్ కూడా  మిగిలిన హీరోల డూప్ సీన్లు బయటకు తీసుకురావడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ రచ్చ మరింత పెరిగింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్… ఇలా ప్రతి హీరో డూప్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు.

హీరోలు డూప్‌లను వాడిన కొన్ని ఉదాహరణలు:


నిజానికి స్టంట్ డూప్‌లు వాడటం సినీ పరిశ్రమలో కొత్త విషయం కాదు. ఇండియన్ సినిమా నుంచే కాదు, బాలీవుడ్, హాలీవుడ్ హీరోలు సైతం డూప్‌లను ఉపయోగిస్తారు.

తెలుగు:

  • NTR – Devara: ఇటీవల ఓ డూప్ ఫైట్ సీన్ లీకైంది.
  • అల్లు అర్జున్ – Pushpa: కొన్ని బైక్ స్టంట్లు, ఫైట్లు డూప్ చేశాడు.
  • రామ్ చరణ్ – RRR: బ్రిడ్జ్ సీన్‌లో కొన్ని స్టంట్లు డూప్ చేసారు.
  • మహేష్ బాబు – Sarkaru Vaari Paata: యాక్షన్ సీన్లలో డూప్ వాడారు.

బాలీవుడ్:

  • షారుఖ్ ఖాన్ – Pathaan: హై-రిస్క్ ఫైట్స్‌లో డూప్ వాడారు.
  • సల్మాన్ ఖాన్ – Tiger 3: బైక్ చేజింగ్ సీన్లకు డూప్ ఉపయోగించారు.
  • హృతిక్ రోషన్ – War: ఫైట్ సీక్వెన్స్‌లకు స్టంట్ డూప్.

హాలీవుడ్:

  • టామ్ క్రూజ్ – తానే స్టంట్లు చేసేవాడు, కానీ కొన్ని ప్రమాదకరమైన సీన్లకు డూప్స్ వాడారు.
  • రాబర్ట్ డౌనీ జూనియర్ (Iron Man), క్రిస్ హేమ్స్‌వర్త్ (Thor) – గ్రాఫిక్స్‌తో కలిపినా, కొన్ని సీన్లకు డూప్స్ వాడారు.
  • డ్వేన్ జాన్సన్ (The Rock) – అతను కూడా ఎక్కువగా స్టంట్ డూప్స్ సహాయం తీసుకుంటాడు.

ఇవి మచ్చుక్కి కొన్ని ఉదాహరణలు మాత్రమే ప్రతి సినిమాకి ఎదో ఒక సీన్ లో, ఒక ఫైట్ లో కచ్చితంగా డూప్ ని వాడే ఉంటారు, మనకి తెరపై కనిపించే ఆర్టిస్ట్ తో మాత్రమే ఆడియన్స్ అండ్ ఫాన్స్ రిసోనేట్ అవ్వాలి కానీ బిహైండ్ ది కెమెరా ప్రాసెస్ ఏంటి? ఎలా తెరకెక్కిస్తున్నారు అనే విషయాలు వదిలేయడం బెటర్. ఇప్పటికే థియేటర్స్ లో సినిమాని చూసి ఎంజాయ్ చేయకుండా రివ్యూల పేరుతో పోస్ట్ మార్టమ్ చేస్తూ కొంతమంది సినిమాని ఎంజాయ్ చేయడం ఎప్పుడో ఆపేసారు, ఇక బిహైండ్ ది స్క్రీన్ లాజిక్స్ కూడా వెతికితే సినిమాని చూడడం కూడా కష్టమే అవుతుంది కాబట్టి సినిమా అభిమానులుగా మనం హీరోల ప్రతిభను ఎంజాయ్ చేయాలి, కానీ అర్థం లేకుండా కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం అనవసరం. ఓ పెద్ద సినిమా మన ముందుకు రావడానికి వెనుక స్టంట్ డూప్స్, గ్రాఫిక్స్ టీమ్, యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఎంతో శ్రమిస్తారు. అందుకే, “డూప్ వాడాడని” అనవసరమైన రియాక్షన్లు ఇవ్వడం సరికాదు.

సినిమా అనేది ఓ మాయాజాలం… ఆ మాయాజాలాన్ని ఎంజాయ్ చేద్దాం!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×