OTT Movie : క్రైమ్-థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి మంచి మసాలా కిక్ ఇచ్చే ఒక మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దేవదాసి పద్ధతులు, ఇద్దరమ్మాయిల లవ్ స్టోరీ, ఒక హత్య చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ను కూడా దక్కించుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘ది షేమ్ లెస్’ (The Shameless) 2024లో హిందీ భాషలో వచ్చిన క్రైమ్-డ్రామా మూవీ. దీనికి బల్గేరియన్ డైరెక్టర్ కాన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించారు. ఇందులో అనసూయ సేన్‌గుప్తా, ఒమారా షెట్టి, ఔరోషిఖ దే, రోహిత్ కొకాటే, మీతా వశిష్ట్ ప్రధాన పాత్రల్లో నటించారు. 115 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ చిత్రం 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. అనసూయ సేన్‌గుప్తా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ను కూడా గెలుచుకున్నారు. దీనికి IMDbలో 5.8/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ముబి, జస్ట్ వాచ్ లలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : సిటీలో మిస్సింగ్ కేసులన్నీ ఈ ‘సేల్స్‌మన్’ కే లింక్… ఓటీటీలోకి వచ్చేసిన మరో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
ఢిల్లీలోని ఒక వేశ్యాగృహంలో రేణుకా (అనసూయ సేన్‌గుప్తా) అనే ముస్లిం మహిళ, ఒక పోలీస్ అధికారిని చంపి, రాత్రిపూట ఎస్కేప్ అవుతుంది. ఆమె చట్టం నుంచి తప్పించుకోవడానికి, ఉత్తర భారతంలోని ఒక దేవదాసి కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. ఈ ప్రాంతంలో ముస్లింలపై వివక్ష ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రేణుకా తన గతాన్ని దాచుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆమె దేవిక (ఒమారా షెట్టి) అనే 17 ఏళ్ల అమ్మాయిని కలుస్తుంది. దేవిక ఒక ప్రముఖ హిందూ కుటుంబానికి చెందినది. కానీ ఆమె కుటుంబం దేవదాసి సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. ఆమె వర్జినిటీని ఎక్కువ ధరకు అమ్మడానికి ఆమె తల్లి ప్లాన్ చేస్తుంది. దేవిక రాపర్ కావాలని కలలు కంటుంది, కానీ ఆమె జీవితం మరోలా వెళ్తుంది.
ఈ క్రమంలో రేణుకా, దేవిక మధ్య ఒక రకమైన ప్రేమ మొదలవుతుంది. ఇది సమాజం, కుటుంబం ఒప్పుకోని ప్రేమ. రేణుకా, దేవిక మధ్య ప్రేమ త్వరగా బ్లాసమ్ అవుతుంది. ఇద్దరూ కలిసి, దేవిక కుటుంబం నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రమాదకర జర్నీ స్టార్ట్ చేస్తారు. రేణుకా, దేవిక తమ స్వేచ్ఛ కోసం ఒక ఫైనల్ పుష్ చేస్తారు. కానీ సినిమా ఒక షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. రేణుకా, దేవిక లవ్ ట్రాక్ ఏమవుతుంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? వీళ్ళు దేవదాసిలుగానే ఉండిపోతారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.