OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ ఈరోజుల్లో ఎలా ముందుకు వెళ్తుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్లకు వెళ్లేవారు. ఇప్పుడు ఇంట్లోనే హ్యాపీగా తనకు నచ్చిన సినిమాను ఎప్పుడైనా చూసుకుంటున్నారు. ఎన్ని సినిమాలు వచ్చినా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను మూవీ లవర్స్ బాగా ఇష్టపడతారు. ఒక రియల్ స్టోరీని స్క్రీన్ మీద చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. ఈ మూవీ పేరేమిటి? ఇందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు “అడెల్టర్స్” (Adulteres). భార్య భర్తను మోసం చేయడంతో భర్త భార్యపై రివెంజ్ ఎలా తీర్చుకున్నాడో మూవీ స్టోరీ లోకి వెళ్తే తెలుస్తుంది. ఇటువంటి స్టోరీలు ఇదివరకే వచ్చినప్పటికీ, ఈ మూవీ కాస్త డిఫ్ఫరెంట్ గా వుంటుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
సామ్యూల్, యాష్లే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. సంతోషం గా ఉంటున్న వీళ్ళిద్దరూ వెడ్డింగ్ అనివర్సరీజరుపుకోవాలని అనుకుంటారు. ఆరోజు వెడ్డింగ్ అనివర్సరీ కావడంతో పార్టీ చేసుకోవాలని అనుకుంటారు. భర్తకి ఆఫీసులో పని ఉండటంతో కాస్త లేటుగా ఇంటికి వస్తానని యాష్లే కి ఫోన్ చేసి చెప్తాడు. అయితే శామ్యూల్ పని ముగించుకొని కాస్త ముందుగానే ఇంటికి వస్తాడు. ఆ సమయంలోనే శామ్యూల్ భార్య, శ్యామ్ అనే వ్యక్తితో ఏకాంతంగా ఉంటుంది. ఇంటికి వచ్చిన శామ్యూల్ అది చూసి షాక్ కు గురవుతాడు. గన్ తీసుకొని వాళ్ళు ఉన్న రూంలోకి వెళ్తాడు. వాళ్లను బట్టలులేకుండా అలాగే ఉండమని, గన్ తో బెదిరించి రకరకాల ప్రశ్నలు అడుగుతాడు. మీరు నన్ను మోసం చేశారంటూ బాధపడతాడు సామ్యూల్. ఎన్నిసార్లు ఇలా జరిగిందంటూ మళ్ళీ వాళ్లను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు. మరొకసారి నా ముందరే అలా చేసుకోమని చెప్తాడు. ఆ తర్వాత శామ్యూల్ ,శ్యామ్ ఇంటికి ఫోన్ చేసి ఆమె భార్యకు ఈ విషయం చెప్తాడు.
కాసేపటి తర్వాత అక్కడికి శ్యామ్ భార్య వస్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ బట్టలు లేకుండా ఉండటం చూసి షాక్ తింటుంది. శ్యామ్ భార్య శ్యామ్ తో నువ్వు అలా చేసినందుకు, నేను కూడా ఆమె భర్తతో అలానే చేస్తానంటూ వాళ్ల ముందరే ఆ పని చేస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. చివరికి శామ్యూల్ వాళ్ళిద్దరిని చంపేస్తాడా? భార్యతో మళ్లీ సంతోషంగా ఉంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “అడెల్టర్స్” (Adulteres) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉండదు. కొన్ని సీన్స్ వేడిపుట్టించే విధంగా ఉండటంతో, ఈ మూవీని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడటం బెటర్. మరెందుకు ఆలస్యం ఈ మూవీపై ఓ లుక్ వేయండి.