Best Horror Movies on OTT : వణుకు పుట్టించే చలి, పైగా దట్టమైన పొగమంచు… బయట అలాంటి వాతావరణం ఉండి, టీవీలో హారర్ సినిమా ఆడుతుంటే భయం మరింత రెట్టింపు అవుతుంది. ఇలా చలికాలంలో కూడా వణికించే హారర్ సినిమాలను చూడాలనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఓటీటీలో ఉన్న బెస్ట్ హారర్ సినిమాల లిస్ట్ ను ఇప్పుడు చూద్దాం.
13బి (12 B)
తన కుటుంబంతో కలిసి కొత్త ఇంటికి మారిన మనోహర్, అతని ఫ్యామిలీ చుట్టూ ’13బి’ కథ తిరుగుతుంది. టీవీలో వచ్చే టెలివిజన్ షో ‘యావరుం నాళం’లో జరిగినట్టే, అచ్చం తన ఫ్యామిలీలో జరుగుతుందని గ్రహిస్తాడు మనోహర్. ఆ తరువాత ఊహించని వింత వింత సంఘటనలు జరుగుతాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్.మాధవన్, నీతూ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఇది డిస్నీ+ హాట్‌స్టార్ (Disney + Hotstar) లో ప్రసారం అవుతోంది.
బుల్‌బుల్ (Bulbbul)
‘బుల్‌బుల్’ స్టోరీ బాల వధువు చుట్టూ తిరుగుతుంది. ఆమె తరువాత ఇంటిపై ఆధిపత్యం చెలాయించే శక్తివంతమైన మహిళగా మారుతుంది. అయితే ఆమె ఉన్న గ్రామంలో అతీంద్రియ శక్తుల కారణంగా, వరుసగా పురుషుల హత్యలు జరగడంతో స్టోరీ కీలక మలుపు తిరుగుతుంది. త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో అవినాష్ తివారీ, పావోలీ డామ్, రాహుల్ బోస్, పరంబ్రత చటోపాధ్యాయ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ప్రసారం అవుతోంది.
పరి (Pari)
‘పరి’ ఒక గుడిసెలో బంధించబడిన రుక్సానా చుట్టూ తిరుగుతుంది, ఆమె దుర్వినియోగానికి గురైనట్లు అందరూ భావించేలా చేస్తుంది. ఆమె ఒక దయగల వ్యక్తిని కలుసుకుంటుంది, అతను అతీంద్రియ సంఘటనలను అనుభవిస్తాడు. ఈ చిత్రంలో అనుష్క శర్మ, పరంబ్రత ఛటర్జీ, రీతాభరి చక్రవర్తి, రజత్ కపూర్ మరియు మాన్సీ ముల్తానీ నటించారు. ఇది ప్రైమ్ వీడియో (Prime Video)లో ప్రసారం అవుతోంది.
1920
‘1920’ మూవీ స్టోరీ ఒక జంట చుట్టూ తిరుగుతుంది. ఈ జంట వివాహం చేసుకున్న తర్వాత కొత్త భవనంలోకి మారతారు. కానీ ఆ తరువాత వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ చిత్రంలో రజనీష్ దుగ్గల్, అదా శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ప్రైమ్ వీడియో (Prime Video) లో ప్రసారం అవుతోంది.
సైతాన్ – Shaitaan
‘సైతాన్’ సంతోషకరమైన కుటుంబం ఎదుర్కొనే కష్టాల చుట్టూ తిరుగుతుంది. ఒక అపరిచితుడు వారి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, ఆ కుటుంబంలోని వ్యక్తుల జీవితాలు తలక్రిందులుగా మారుతాయి. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, జ్యోతిక, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ప్రసారం అవుతోంది.
రాజ్ – (Raaz)
‘రాజ్’ మూవీ తమ వివాహా బంధాన్ని నిలబెట్టుకోవడానికి వెకేషన్ కు వెళ్లే సంజన, ఆదిత్యల జంట చుట్టూ తిరుగుతుంది. సంజనను ఆత్మ వెంటాడినప్పుడు పరిస్థితులు వేరే మలుపు తిరుగుతాయి. విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డినో మోరియా, బిపాసా బసు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రైమ్ వీడియో (Prime Video) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.