BigTV English

OTT Movie : ఫోన్ లో బ్లాక్ మెయిల్… పోలీసులను బురిడీ కొట్టించే అమ్మాయి

OTT Movie : ఫోన్ లో బ్లాక్ మెయిల్… పోలీసులను బురిడీ కొట్టించే అమ్మాయి

OTT Movie : మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. దృశ్యం సినిమా తర్వాత మలయాళం ఇండస్ట్రీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ హవా కొనసాగుతోంది. మంచి కథను తీసుకొని సింపుల్ టేకింగ్ తో తెరమీద ప్రజెంట్ చేయగలుగుతున్నారు మలయాళీ దర్శకులు. ఎన్నో ట్విస్టులు ఉన్న ఒక మలయాళం మూవీ తొందర్లో ఓటిటిలో స్ట్రీమింగ్ కాబో తుంది. ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


మనోరమ మ్యాక్స్ (ManoramaMAX)

ఇప్పుడు మనం చెప్పుకొనే మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు,”అగతోకాకొలాజికల్” (Agathokakological ) ఈ మూవీలో ఒక సైకో హీరోయిన్ ను వెంబడిస్తూ వేధిస్తుంటాడు. అతడు ఎవరో  తెలుసుకొనే ప్రయత్నం లో కొన్ని దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వస్తాయి. ఆ సైకో చుట్టూ స్టోరీ మూవ్ అవుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్  “మనోరమ మ్యాక్స్” (ManoramaMAX) లో స్ట్రీమింగ్ కాబోతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ పెళ్లి చేసుకున్న తరువాత తన భర్తతో కలసి హ్యాపీగా ఉంటుంది. ఆమె భర్తకి అనారోగ్యం రావడంతో కొద్దిరోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్తారు. ఈ క్రమంలో ఒక అపరిచిత వ్యక్తి నుంచి హీరోయిన్ కు ఒక కాల్ వస్తుంది. నిన్ను వదిలిపెట్టను అంటూ మాట్లాడుతూ భయపెడుతుంటాడు. ఆ తర్వాత అతను పదే పదే కాల్ చేస్తుండటంతో, ఈ విషయం భర్తకు చెప్తుంది. వీరిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఆ మరసటి రోజు ఆ వ్యక్తి మొహానికి మాస్క్ పెట్టుకుని హీరోయిన్ తో మీ అంతు  చూస్తాను అంటూ బెదిరిస్తూ వెళ్ళిపోతాడు. ఒకరోజు ఆఫీస్ నుంచి హీరోయిన్ ఒంటరిగా వస్తుండగా ఆమెను కత్తితో పొడిచి వెళ్లిపోతాడు. భర్త ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తాడు. ఆ తరువాత ఒక వ్యక్తి హీరోయిన్ ఇంటిదగ్గర కొన్ని లెటర్ లు వేసి హీరోయిన్ ను బెదిరిస్తుంటాడు.

పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా హీరోయిన్ ఇంటి ముందర కొన్ని లెటర్లు వేసిన వ్యక్తిని పట్టుకుంటారు. ఆ వ్యక్తి ఎవరో కాదు హీరోయిన్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. అతనిని విచారించగా, ఆ బ్లాక్మెయిల్ లెటర్ లు మీకు కంప్లైంట్ ఇచ్చిన ఆమె వెయ్యమని చెప్పిందని చెప్తాడు. ఇది విని షాక్ అయిన పోలీసులు హీరోయిన్ విచారిస్తారు. చివరికి హీరోయిన్ పోలీసులకు ఏమి సమాధానం చెబుతుంది. ఆ సైకోను పోలీసులు కనిపెట్టారా? గతంలో ఆ సైకో తో హీరోయిన్ కు ఏమైనా విభేదాలు ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే తొందరలో మనోరమ మ్యాక్స్ (ManoramaMAX) లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ “అగతోకాకొలాజికల్” (Agathokakological ) సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వెండితెరపై మంచి టాక్ తెచ్చుకుని తొందరలో ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×