OTT Movie : సాధారణంగా హీరోలకు స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ అక్కడ తమ టాలెంట్ ని చూపించే ఛాన్స్ ఉండదు. కేవలం గ్లామర్ డాల్స్ లాగే కనిపించాల్సి వస్తుంది. కానీ కొన్ని వెబ్ సిరీస్ లు లేదా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అయితే హీరోయిన్లు తమ అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. అందుకే చాలామంది హీరోయిన్లు మంచి స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తారు. అందులోనూ వేశ్య పాత్రను పోషించి పాపులర్ అయిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. రీసెంట్ గా హీరోయిన్ అంజలి కూడా ఇలాంటి పాత్రలో నటించింది. అయితే అది సినిమా కాదు వెబ్ సిరీస్. మరి ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
జీ5 (Zee 5)లో స్ట్రీమింగ్
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ లో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఇందులో అనన్య నాగళ్ల, రవీంద్ర విజయ్ కీలకపాత్రలు పోషించారు. ముఖేష్ ప్రజాపతి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ పేరు ‘బహిష్కరణ‘ (Bahishkarana). ఈ సిరీస్ ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా మొత్తం పుష్ప అనే వేశ్య చుట్టూ తిరుగుతుంది. ఓ ప్రెసిడెంట్ ఆమెను ఇష్టపడితే, ఆమె మాత్రం అతడి పనోడి పై మనసు పడుతుంది.
కథలోకి వెళ్తే…
సినిమా స్టోరీ అంతా పెద్దపల్లి అనే గ్రామంలో నడుస్తుంది. పెద్దపల్లి తో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాలకు దాదాపు పది గ్రామాలకు శివయ్య ఒక్కడే ప్రెసిడెంట్. తను చెప్పిందే వేదం అన్నట్టుగా శివయ్య ఏక ఛత్రాధిపత్యం చెలాయిస్తాడు. మరోవైపు పుష్ప అనే అమ్మాయి ఊరూరా తిరిగి వేశ్య వృత్తి చేసుకుంటుంది. అయితే ఒకానొక సందర్భంలో ఆమెను చూసి ఆమె అందచందాలకు ముగ్ధుడు అవుతాడు శివయ్య. దీంతో ఆమెను తీసుకొచ్చి ఊరు చివర ఉన్న తన తోట ఇంట్లో కాపురం పెడతాడు. అతనికి ఉంపుడుగత్తె గా మారిపోతుంది పుష్ప. ఈ క్రమంలోనే శివయ్య దగ్గర పని చేసే మరో వ్యక్తి కన్ను పుష్పపై పడుతుంది. అందుకే ఆమెను లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ పుష్ప మాత్రం శివయ్య దగ్గర పని చేసే మరో వ్యక్తి దర్శి చూపించే ప్రేమకు ఫీదా అవుతుంది. దర్శి శివయ్యకు కుడి భుజం లాంటివాడు. అయితే ఈ క్రమంలో వాళ్ల ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనే విషయం తెలుసుకున్న శివయ్య ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. దర్శి తన మరదల్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులను కల్పిస్తాడు. మరి చివరికి దర్శి, పుష్పల ప్రేమ వ్యవహారం ఎక్కడికి దారి తీసింది? అతను తన మరదల్ని పెళ్లి చేసుకున్నాడా? అతను ఎందుకు జైలుకు వెళ్తాడు? ఊర్లో ఉన్న దర్శి సామాజిక వర్గానికి చెందిన ఆడపిల్లలే ఎందుకు చనిపోతున్నారు? అమ్మాయిల మరణాలకు కారణం ఏంటి? చివరికి పుష్ప ఏం చేసింది? దర్శి జైలు నుంచి విడుదలయ్యాడా లేదా ? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ ను ఒకసారి చూడాల్సిందే.