OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు మంచి ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఎంగేజింగ్ గా ఉంచుతాయి. అందుకే ఓ వర్గం ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు అంటే పడి చచ్చిపోతారు.. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయంలోకి వెళ్తే…
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…
సైకో కిల్లర్ సినిమాలు అనగానే దాదాపుగా ఒకే పాటర్న్ కలిగి ఉంటాయి. సినిమాలో ఒక సైకో కిల్లర్ ఉండడం, వాడికి ఒక గతం ఉండడం, ఆ గతంలో విషాదం… దాన్నే మనసులో పెట్టుకొని అందరినీ వేటాడి వేటాడి చంపే మనిషి. ఇలాంటి సినిమాలు ఎన్నో ఇప్పటిదాకా తెరపై చూసాం మనం. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే. కానీ ఏకంగా ఈ సైకో కిల్లర్ మనుషులనే చంపి వండి వడ్డిస్తాడు. ఈ సినిమా పేరు ‘థాంక్స్ గివింగ్‘ (Thanks Giving). ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే…
సినిమాలో ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది. అక్కడ ప్రతి ఏడాది థాంక్స్ గివింగ్ టైంలో బిగ్గెస్ట్ సేల్ జరుగుతుంది. అందులో తమకు అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి టౌన్ లో ఉండే ప్రజలంతా భారీ ఎత్తున అక్కడికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆ ఏడాది థాంక్స్ గివింగ్ సేల్ లో అదే మార్ట్ లో జరిగిన తొక్కిసలాటలో చనిపోతారు. దీంతో ఆ మార్ట్ పేరు మార్మోగిపోతుంది. అయితే ఈ ఊహించని సంఘటనతో సదరు మార్ట్ కి మంచి ఫేమ్ వస్తుంది. కానీ దాంతో పాటే మరో ప్రమాదం కూడా మొదలవుతుంది. అప్పటి నుంచి మార్ట్ లో వరస హత్యలు మొదలవుతాయి. అయితే అందులో పని చేసే వ్యక్తి ముందుగా హత్యకు గురవుతారు. దీంతో పోలీసులు ఆ మార్ట్ లో జరిగిన తొక్కిసలాటలో ప్రమేయం ఉన్న వాళ్ళని ఆ కిల్లర్ టార్గెట్ చేస్తున్నాడని అనుమానపడతారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కొన్ని దారుణమైన పోస్టులు పెట్టి ఆ మార్ట్ ఓనర్ ను టార్గెట్ చేస్తాడు కిల్లర్. అయితే ఆమె కంటే ముందు ఆమెకు సంబంధించిన వాళ్ళందరిని చంపడానికి ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా తన ఫ్రెండును ఆమె కళ్ళముందే చంపేస్తాడు. ఆ తర్వాత మార్ట్ ఓనర్ తో పాటు ఆమె తల్లిదండ్రులని కూడా కిడ్నాప్ చేస్తాడు. ఆ అమ్మాయి కళ్ళముందే తన తల్లిని ముక్కలు ముక్కలుగా నరికి వండి ఆ తర్వాత తను కిడ్నాప్ చేసిన మనుషులకు ఆ వంటను సర్వ్ చేస్తాడు. అదే టైమ్ లో వాడి నుంచి హీరోయిన్ తో పాటూ మరొకరు తప్పించుకుని దగ్గరలో ఉన్న అడవిలోకి పరిగెత్తుతారు. మరి ఆ కిల్లర్ నుంచి జెస్సికా అనే హీరోయిన్ తప్పించుకోగలిగిందా? అసలు ఆ కిల్లర్ ఇలా చేయడానికి గల కారణం ఏంటి? ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు? అతని గతం ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ సినిమాను తెరపై చూడాల్సిందే.