BigTV English

OTT Movie : అమ్మాయిల్ని చంపేసే గాలి… రూపాలు మార్చే అమ్మాయి… మోస్ట్ వైలెంట్ ఫ్యాంటసీ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల్ని చంపేసే గాలి… రూపాలు మార్చే అమ్మాయి… మోస్ట్ వైలెంట్ ఫ్యాంటసీ థ్రిల్లర్

OTT Movie : కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయంటే వాటిని చూస్తున్నంత సేపు మనం ప్రపంచాన్నే మర్చిపోతాము. ఎప్పుడైనా సైన్స్ ఫిక్షన్ కథకి, హారర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చూశారా? అలా చూడాలి అనుకునే వారి కోసమే ఈ అరుదైన కాంబినేషన్లో వచ్చిన మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. మరి సినిమా స్టోరీ ఏంటి? ఎక్కడ చూడొచ్చు? అనే విషయంలోకి వెళ్తే…


ఫ్రీగానే చూడొచ్చు…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమాను ఫ్రీగానే చూడొచ్చు. కాకపోతే ఈ సైన్స్ ఫిక్షన్ హర్రర్ మూవీలో వయోలెన్స్ కూడా భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తపాతం సన్నివేశాలు చూడడానికి ఇబ్బందికరంగా అనిపిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు “ట్యాగ్” (Tag). 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ (Youtube) లో అందుబాటులో ఉంది. కాబట్టి ఏ ఓటిటికి సబ్ స్క్రిప్షన్ అక్కర్లేకుండానే ఈ సినిమాను ఫ్రీగా చూడొచ్చు.


కథలోకి వెళ్తే…

మూవీ మొదట్లోనే కొంతమంది స్టూడెంట్స్ బస్సుల్లో టూర్ కి వెళ్తారు. అయితే అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటే హీరోయిన్ మాత్రం డైరీ రాసుకుంటుంది. సడన్ గా తన పెన్ కింద పడిపోవడంతో ఆ పెన్ తీసుకుని పైకి లేచేలోపే ఆ బస్సులో ఉన్న స్టూడెంట్స్ అంతా బస్సుతో పాటే సగానికి కట్ అయిపోయి ఉంటారు. అది చూసి షాక్ అయిన హీరోయిన్ ఏమీ అర్థం కాక అక్కడ నుంచి పారిపోతుంది. కానీ ఆ అమ్మాయిని ఒక గాలి వెంట పడుతూ మరింత పరుగులు పెట్టిస్తుంది. ఆ గాలి తాకితే అక్కడికక్కడే సగానికి కట్ అయిపోతారు మనుషులు. మొత్తానికి అక్కడ నుంచి తప్పించుకొని స్కూల్ కి వెళ్ళగా, అక్కడ కొందరు అమ్మాయిల్ని తన ఫ్రెండ్స్ అనుకుంటుంది. మొత్తానికి అందరితో పాటు కలిసి టీచర్ ఎంత చెప్పినా వినకుండా స్కూల్ కి బంక్ కొట్టి బయటకు వెళ్తారు. చంపడానికి వెంటపడతారు.

ఇంకేముంది అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్ళలో హీరోయిన్ మాత్రమే మళ్ళీ బయట పడుతుంది. ఓ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక అక్కడ అద్దంలో చూసుకుంటే తనకు తానే కొత్తగా కనిపిస్తుంది. ఇక ఒక పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ పెళ్లి అంటూ ఆమెను పెళ్లికూతురు డ్రెస్ లో చర్చికి తీసుకెళ్తుంది. తీరా అక్కడికి వెళ్తే పెళ్లి కొడుకు స్థానంలో ఒక పంది ఉంటుంది. మళ్లీ అక్కడ నుంచి పరుగులు పెడుతుంది హీరోయిన్. ఆ తర్వాత సడన్ గా మరో డ్రెస్ లో కనిపిస్తుంది. ఇప్పుడేమో తీరా చూస్తే ఆమె మంచి రన్నర్ అంటూ రన్నింగ్ రేస్ లో పరిగెత్తిస్తారు. అసలు హీరోయిన్ ఇలా ఎందుకు రూపాలు మారుతుంది? అసలు ఆమె విషయంలో ఏం జరుగుతోంది? అనే విషయాలు తెలియాలంటే యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతున్న “ట్యాగ్”(Tag) సినిమాపై ఒక లుక్కెయ్యండి.

Tags

Related News

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇంటర్వ్యూకు వచ్చిన 8 మంది ఒకే గదిలో… అమ్మాయి బట్టలు విప్పుతూ… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజులు అదే పాడు పని… వీళ్ళు మనుషులా మానవ మృగాలా ? ఈ మూవీ పెద్దలకు మాత్రమే

Big Stories

×