BigTV English

OTT Movie : కూలీలతో చేయకూడాని పనులు చేయించే భార్య భర్తలు … ట్విస్ట్ లతో అదరగొట్టే మూవీ

OTT Movie : కూలీలతో చేయకూడాని పనులు చేయించే భార్య భర్తలు … ట్విస్ట్ లతో అదరగొట్టే మూవీ

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను చూడటానికి మూవీ లవర్స్ చాలా ఇష్టపడతారు. ఈ సినిమాలలో వచ్చే సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఈ సినిమాలు చివరి వరకు వచ్చే సస్పెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చాలానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘బెనిత్‘ (Beneath). వలస కూలీల జీవితాలతో ఆడుకునే ఒక జంట చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

భార్య భర్తలు వ్యవసాయ భూములను ఫామ్ హౌస్ లు మార్చే బిజినెస్ చేస్తూ ఉంటారు. అమెరికాలో లేబర్ చాలా కాస్ట్లీ అవ్వడంతో, వలస కూలీలను తీసుకువచ్చి పని చేయించుకుంటూ ఉంటారు. అయితే తీసుకొచ్చిన కూలీలను పని అయిపోగానే టార్చర్ పెట్టి చంపేస్తూ ఉంటారు. ఈ కూలీలకు ఐడెంటిటీ సరిగ్గా ఉండకపోవడంతో పోలీసుల దృష్టిలో కూడా పడకుండా ఉంటారు. అందువలన ఈ భార్య భర్తలు చేసే అరాచకాలు ఎవరూ గుర్తించరు. ఒకసారి అలెగ్జాండర్, టోనీ అనే ఇద్దరు వ్యక్తులను పనిలోకి తీసుకుంటారు. పని అయిపోగానే ఈ భార్యాభర్తలు తమ క్రూరత్వాన్ని వీరిపై చూపిస్తారు. వీరిపై తుపాకీ గురిపెట్టి ముందుగా బట్టలు విప్పేసి ఒక గోతిని తవ్వమంటారు. వీరు గోతిని తవ్వుతూ, ఈ గోతిలోనే మనల్ని చంపి పాతిపడతారేమో అని భయపడతారు. భార్య భర్తలు మాత్రం ఇలా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చివరికి ఆ గుంతలలో మొక్కలు నాటిస్తారు. ఆ తర్వాత వీళ్లను ఒక అండర్ గ్రౌండ్ లో బంధిస్తారు. అక్కడ చాలా శవాలు పడి ఉండటంతో వీళ్ళు  భయపడుతూ ఉంటారు.

వీళ్ళను బాగా టార్చర్ చేయడంతో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, ఒక కుక్క అలెగ్జాండర్ ని బాగా కరుస్తుంది. అతని తమ్ముడు టోనీ అక్కడినుంచి ఎలాగో బయటపడతాడు. అయితే అతడు ఎవరినైనా సహాయం అడగాలని కొంత దూరం వెళ్ళాక ఒక ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్లడంతో కిల్లర్ అనుకొని టోనీని గన్ తో షూట్ చేస్తారు. అతను అక్కడికక్కడే చనిపోతాడు. అలెగ్జాండర్ మాత్రం ఆ భార్యాభర్తలకి దొరికిపోతాడు. అతన్ని టార్చర్ చేస్తుండగా భార్య ఒక గదిలోకి వెళ్తుంది. ఆ సమయంలోనే అలెగ్జాండర్ భర్తని చంపేస్తాడు. అక్కడినుంచి పారిపోతూ నన్ను టార్చర్ చేసిన అత భార్యని కూడా చంపాలని మళ్ళీ వెనక్కి వస్తాడు. ఈ క్రమంలోనే భార్యను కూడా చంపి, అక్కడినుంచి బయట పడతాడు. చివరికి అలెగ్జాండర్ ని పోలీసులు పట్టుకుంటారా? అలెగ్జాండర్ తన జీవితాన్ని అక్కడే మళ్లీ మొదలుపెడతాడా? తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×