Dark Neck: తరచుగా మన ముఖం, చేతులు, కాళ్ళను జాగ్రత్తగా చూసుకున్నా కూడా మనం మన మెడపై అంత శ్రద్ధ చూపించం. మెడపై నల్లగా మారడానికి కూడా ముఖ్య కారణం ఇదే. మెడపై కనిపించే ఈ నల్లదనం కొన్నిసార్లు మురికి, దుమ్ముతో పాటు డెడ్ స్కిన్ లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వస్తుంది. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మెడపై ఈ నలుపు మరింత పెరుగుతుంది. ఇది చాలా అసహ్యంగా కనిపిస్తుంది. దీని వల్ల చాలా సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది కూడా .
నిమ్మకాయ:
నిమ్మకాయలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. ఇది చర్మంపై ఉన్న నల్లదనాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా తేనె కూడా చర్మానికి తేమను అందిస్తుంది. ఒక టీస్పూన్ నిమ్మరసంలో అర టీస్పూన్ తేనె మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత మెడను కడగాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా చర్మం గ్లోయింగ్ గా మారుతుంది.
శనగ పిండి, పసుపు:
శనగ పిండి, పసుపులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఒక టీస్పూన్ శనగపిండిలో అర టీస్పూన్ పసుపు , కాస్త నీరు లేదా పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. దీన్ని మెడకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రంగా రుద్దేయండి.ఇలా చేయడం వల్ల చర్మం ఉన్న నలుపు రంగును పూర్తిగా తొలగిస్తాయి. అంతే కాకుండా తెల్లగా మెరిసేలా చేస్తాయి.
అలోవెరా జెల్:
అలోవెరా జెల్ మీ ఇంట్లో అందుబాటులో ఉంటే, మెడలోని చీకటిని తొలగించడానికి దాన్ని ఉపయోగించండి. దీన్ని ఉపయోగించాలంటే మెడకు తాజా కలబంద జెల్ రాసి అరగంట తర్వాత కడిగేయాలి.
పెరుగు, పసుపు:
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మం పై ఉండే నలపు దనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక చెంచా పెరుగులో చిటికెడు పసుపు వేసి పేస్ట్ లాగాచేసి మెడపై నల్లగా ఉన్న చోట పట్టించండి. దీనిని 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి.
టమాటో:
టమాటోలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మంపై మృత కణాలను పోగొట్టడంలో సహాయపడుతుంది. అందుకే టమాటోను నేరుగా మెడపై రుద్ది .. కొంత సమయం తర్వాత మెడను శుభ్రం చేసుకోవాలి. దీన్ని కొన్ని రోజులు ఉపయోగించడం వల్ల మీ మెడ మెరిసిపోతుంది.
Also Read: ఇలా చేస్తే.. కాళ్ల పగుళ్లు త్వరగా తగ్గిపోతాయ్
ఆరెంజ్ తొక్క:
ఆరెంజ్ తొక్కలో ఉండే సిట్రిక్ యాసిడ్ మెడపై ఉన్న నలుపుదన్నాన్ని తొలగిస్తుంది నారింజ తొక్కను నేరుగా మెడపై తేలికగా రుద్దండి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మెడపై నలుపు తొలగిపోతుంది. అంతే కాకుండా తరుచుగా ఇలా చేయడం వల్ల మెడ తెల్లగా మెరిసిపోతుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.