BigTV English

OTT Movie : బీచ్ లో వింత విల్లాలో భార్యాభర్తలు… అచ్చం వాళ్లలాగే కనిపించే మరో ఇద్దరిని చూసి షాక్

OTT Movie : బీచ్ లో వింత విల్లాలో భార్యాభర్తలు… అచ్చం వాళ్లలాగే కనిపించే మరో ఇద్దరిని చూసి షాక్

OTT Movie :  కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. మరికొన్నిసార్లు భయమేస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం ఈ రెండు అంశాలు కలగలిపి ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ 3000 కధతో ఎక్కిన ఈ కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటిటిలోకి అడుగు పెట్టింది. మరి ఇంట్రెస్టింగ్ కధతో రూపొందిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? సినిమా పేరేంటి? అనే విషయంలోకి వెళ్తే.


తెలుగులో కూడా స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా అక్టోబర్ 11న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే థియేటర్లలో రిలీజ్ అయి పట్టుమని 20 రోజులు కూడా కాకముందే ఓటిటిలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఒకే ఒక్క భాషలో స్ట్రిమింగ్ అవుతుండడం విశేషం. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా ఆమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషలో త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో జీవ హీరోగా నటించగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. కేజీ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహించిన ఈ హిట్ మూవీ పేరు “బ్లాక్” (Black). ఈ సినిమాలోని టేకింగ్ ట్విస్ట్ లతోపాటు కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. హాలీవుడ్ సినిమా “కొహరెన్స్” కు ఇది రీమేక్ అనే ప్రచారం జరిగింది. అలాగే కేవలం 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా ఈ మూవీ 25 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ ఐ ఎమ్ డి బి లో 7.7 రేటింగ్ తెచ్చుకోవడం విశేషం.


కథలోకి వెళ్తే

వసంత్ అరణ్యం అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఈ జంట బీచ్ దగ్గరలో ఉండే విల్లాను కొంటారు. అయితే వీకెండ్ కావడంతో సరదాగా గడపడానికి ఆ బీచ్ కు వెళ్తారు. అయితే వీళ్లకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో విచిత్రంగా అచ్చం అరణ్య వసంత్ ల రూపంలోనే మరో జంట కనిపించడంతో షాక్ అవుతారు. ఆ తర్వాత కొంతసేపటికి అరణ్య కనిపించకుండా పోతుంది. ఆమె కోసం అన్వేషిస్తూ వెళ్లిన వసంత్ కు 1960ల కాలం నాటికి చెందిన మనో అనే వ్యక్తికి ఈ విల్లాకు సంబంధం ఉందని తెలుస్తుంది. అసలు అరణ్య ఎక్కడికి వెళ్ళింది? ఈ మనో అనే వ్యక్తి ఎవరు? తమ ఆపోజిట్ వాళ్ళు అచ్చం వీళ్ల రూపంలో ఎందుకు ఉన్నారు? చివరికి అరణ్యను వసంత్ కాపాడుకోగలిగాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఆమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “బ్లాక్” (Black) మూవీపై ఒకసారి లుక్కేయ్యండి. ఈ మూవీ ఓటీటీ లవర్స్ ను ఓ లెవల్లో ఎంటర్టైన్ చేస్తుంది.

Related News

Friday Ott Release Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు..

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

Big Stories

×