BigTV English

November Movies 2024 : నవంబర్ లో సినిమాల సందడే సందడి.. ఎన్ని సినిమాలు రిలీజంటే?

November Movies 2024 : నవంబర్ లో సినిమాల సందడే సందడి.. ఎన్ని సినిమాలు రిలీజంటే?

November Movies 2024 : దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 4 సినిమాలు సందడి చేసాయి. ఆ సినిమాల్లో మూడు సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసే కలెక్షన్స్ ను అందుకున్నాయి. ఇక నవంబర్, డిసెంబర్, సంక్రాంతి సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నవంబర్ లో చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అందులోను స్టార్ హీరోల సినిమాలే పోటీ పడుతుండటం విశేషం.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం సందడి చేయబోతున్న సినిమాలేంటో ఒక లుక్ వేద్దాం పదండీ..


మొదటి ఫ్రైడే రోజున నవంబర్ 1న రెండు హిందీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ రెండూ సీక్వెల్స్ కావడం విశేషం. హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ అయిన భూల్‌ భులయ్యా 3 ఈరోజు రిలీజ్ అయింది. కార్తిక్ ఆర్యన్, త్రిప్తి డిమ్రి ఇందులో లీడ్ రోల్స్‌లో నటించారు. ఆ సినిమా గతంలో వచ్చిన రెండు సినిమాలకు సీక్వెల్ గా వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

మొదటి శుక్రవారం దెయ్యాలు భయపెడితే.. రెండు వారం నవంబర్ 8 న రెండు సినిమాలు సందడి చేయబోతున్నాయి. హీరో నిఖిల్‌, రుక్మిణి వసంత్ జంటగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా నవంబర్ 8న రిలీజ్ కాబోతుంది. అలానే సతీష్ బాబు రాటకొండ ‘జాతర’ సినిమా కూడా ఇదే రోజు రాబోతుంది.అలాగే రాకేశ్‌ వర్రే హీరోగా దర్శకుడు విరించి వర్మ రూపొందించిన ‘జితేందర్‌ రెడ్డి’ కూడా నవంబర్ 8న రిలీజ్ కానుంది.. అలాగే చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా రూపొందిన ‘ధూం ధాం’, స్వీయ దర్శకత్వంలో విప్లవ్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘ఈసారైనా’ చిత్రాలు కూడా నవంబర్ 8నే రానున్నాయి..


అలాగే నవంబర్ 14 న గట్టి పోటీనే ఉంది.. తమిళ స్టార్ హీరో సూర్య, వరుణ్ తేజ్ నటించిన సినిమాలు పోటీ పడబోతున్నాయి. సూర్య భారీ బడ్జెట్ చిత్రం కంగువ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా శివ తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ నటించిన ‘మట్కా’ కూడా ఇదే రోజు రాబోతుంది. ఇందులో వరుణ్ తేజ్ లుక్ కొత్తగా ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు అశోక్‌ గల్లా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది.

ఇక చివరగా నవంబర్ 15 న నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘లెవన్‌’ రాబోతుంది. హిందీ మూవీ ‘ది సబర్మతీ రిపోర్ట్‌’ కూడా ఈ నెల 15న రానుంది. ఇక నెలాఖరుతో మరోసారి యంగ్ హీరోలు ఢీ కొట్టబోతున్నారు.. ఇక నవంబర్ 22 న విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ సినిమా,సత్యదేవ్ లేటెస్ట్ మూవీ ‘జీబ్రా’ ఈ నెల 22న రానుంది. అలానే ‘రోటి కపడా రొమాన్స్‌’ అనే సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×