OTT Movie : మలయాళం సినిమాలకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మంచి కథలతో వస్తున్న ఈ మూవీలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి ఈ మలయాళం మూవీస్. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఒక మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటో? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
సోనీ లివ్ (Sony Liv)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ పేరు ‘చురులి‘ (Churuli). ఈ మూవీలో ఒక కిల్లర్ని పట్టుకోవడానికి పోలీసులు ఒక మారుమూల గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామం లో పోలీసులు ఎదుర్కొనే పరిస్థితులతో మూవీ స్టోరీ నడుస్తుంది ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లివ్ (Sony Liv) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
జాయ్ అనే క్రిమినల్ ని పట్టుకోవడానికి ఇద్దరు పోలీసులు ఒక మారుమూల ప్రాంతానికి బయలుదేరుతారు. వీళ్లు అసలు పేర్లను దాచిపెట్టి యాంటోని, సహజీవన్ లుగా పేర్లు మార్చుకుంటారు. ఆ ప్రాంతానికి చేరుకోగానే అక్కడ తంకన్ అనే వ్యక్తి జీపు నడుపుతూ, వీళ్లను ఎక్కడికి వెళ్లాలని అడుగుతాడు. ఈ ఊరికి లబ్బర్ తీసే పనికి వచ్చామని ఆ పలిసులు అబద్ధం చెప్తారు. అయితే ఈ ఊరిలో ఒకరి దగ్గర లబ్బర్ తీసే పని ఉండటంతో, అక్కడికే వచ్చి ఉంటారని వీళ్లను అక్కడికి తీసుకువెళ్తాడు తంకన్. ఆ ప్రాంతంలోని ఒక కొట్టు దగ్గర వీళ్ళని వదిలిపెడతాడు. ఆ కొట్టులో ఉండే కరియేషన్ వీళ్లకు ఫుడ్ పెడుతూ ఉంటాడు. కరియేషన్ దగ్గర ఉంటూ, జాయ్ అడ్రస్ కోసం వీళ్లు వెతుకుతూ ఉంటారు. అయితే ఆ ఊరిలో అందరూ చాలా వింతగా ఉంటారు. అందరికీ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. పోలీసులమని తెలిస్తే ఈ ఊరి మనుషులు ఏం చేస్తారో అని వీళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. చివరికి యాంటోని, సహజీవన్ లబ్బర్ తీయడానికి రాలేదని తంకన్ తెలుసుకుంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారని ఆ ఊరి జనం వీళ్ళని నిలదీస్తారు.
వీళ్ళిద్దరిని ఆ ఊరి జనం చంపడానికి ప్రయత్నిస్తుండగా యాంటోని, సహజీవన్ లు వారిపై కల్పులు జరుపుతారు. మేము పోలీసులమని జాయ్ అనే క్రిమినల్ కోసం వచ్చామని చెప్తారు. తంకన్ వీళ్లిద్దరిని ఒక చోటికి తీసుకెళ్తాడు. జాయ్ అనే క్రిమినల్ పక్షవాతం వచ్చి ఒక మంచం మీద పడి ఉంటాడు. యాంటోని, సహజీవన్ అతన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ తరువాత ఆ ప్రాంతంలో యాంటోని, సహజీవన్ లు కొన్ని అనుకోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి ఆ ఊరి ప్రజలు, పోలీసులను ఏమైనా చేస్తారా? పోలీసులు జాయ్ ని పట్టుకుంటారా? ఆ ఊరు నుంచి ఇంతకీ వీళ్లు బయట పడతారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘చురులి’ (Churuli) అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.