Sankranthiki Vastunnam : టాలీవుడ్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ఎంత చెప్పినా తక్కువే పటాస్ సినిమాతో మొదలుకొని ఎఫ్ 3 వరకు మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. భగవంత్ కేసరి సినిమా భారీ విజయాన్ని అందుకుంటే విక్టరీ వెంకటేష్ తో ఎక్కువగా సినిమాలు చేసాడు. చేస్తున్నాడు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తు్న్నాడు. దీంతో ఈ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
సుప్రీమ్ ను కాపీ కొట్టాడా?
అదేంటంటే.. అనిల్ రావిపూడి గతంలో తీసిన ఓ సినిమాలోని సీన్స్ ను ఈ మూవీలో దించేసాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. సుప్రీమ్ 2016లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు.. ఈ మూవీలో రాశి ఖన్నా బెల్లం శ్రీదేవి అనే కామెడీ పోలీస్ పాత్రలో నటించింది. అదే విధంగా ఇప్పుడు రాబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో దించేశాడని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది. ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ పోలీసు పాత్ర బెల్లం శ్రీదేవి అని సుప్రీం సినిమా లో కామెడీ ట్రాక్ పెట్టారు… ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరితో సేమ్ అలాంటి కామెడీ ట్రాక్ ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రై చేస్తున్నారు. సుప్రీం సినిమాలో రాశి కన్నా చేసింది ఇరిటేట్ గా ఉన్న సినిమా ప్లస్ అయింది.. కానీ ఇప్పుడు సంక్రాంతికి గింఛన్ చేయాలంటే పెద్ద సినిమాలు ఉన్నాయి అప్పుడు అలాంటి సిల్లీ కామెడీ ట్రాకులను ప్రజలు పట్టించుకోకపోవచ్చు అది సినిమాకు మైనస్ అవ్వచ్చు అనిల్ రావు పూడికి అప్పుడు మ్యాజిక్ జరిగింది ఇప్పుడు మేనేజ్ మ్యానేజ్ చేస్తాడేమో చూడాలి.. ఈ సినిమా పై బోలెడు ఆశలు అయితే పెట్టుకున్నాడు.. అటు వెంకీ కూడా కమర్షియల్ హిట్ కోసం తెగ ట్రే చేస్తున్నాడో చూద్దాం..
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ విశేషాలు..
ఈ సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్‌ను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారట. ఈ షూటింగ్‌లో వెంకటేష్‌తో పాటు పలువురు కీలక ఆర్టిస్టులు పాల్గొంటున్నారట. ఈ ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా ఉండబోతున్నాయని.. వెంకీ తన ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని తెలుస్తోంది.. ఇక పోతే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి…