BigTV English

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆ వీడియోలు… క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమ్మ తిరగాల్సిందే

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆ వీడియోలు… క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమ్మ తిరగాల్సిందే

OTT Movie : ఏఐ అనేది అతిగా వాడితే ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి అని భయపడతారు చాలామంది. అందుకే రోబోట్స్ వంటి డెవలప్మెంట్స్ కి దూరంగా ఉంటే మంచిదని సజెషన్స్ కూడా ఇస్తారు. కానీ ఇప్పటికే మనం ఎంతగానో డెవలప్ అయిన ఫోన్లు అందులో ఉన్న ఏఐలు అలాగే సోషల్ మీడియాలను వాడుతున్నాము. మనలో చాలామంది సోషల్ మీడియాకి అడిక్ట్ కూడా అయిపోయారు. అలా అడిక్ట్ అయిన వారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. మరి ఈ సినిమా పేరేంటి? దీని కథ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…


తెలుగులో స్ట్రీమింగ్..

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా నిజానికి హిందీలో రూపొందింది. ఈ సినిమా పేరు “కంట్రోల్” (CTRL). బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించింది. నిజానికి ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. నేరుగా ఓటిటిలోకి వచ్చేసింది. దీనికి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించారు. ఈ కంట్రోల్ సినిమా ఓటిటిలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ మూవీ టీజర్ ట్రైలర్లను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో అసలు సినిమా తెలుగులో అందుబాటులో ఉంటుందా అని అనుమానాలు రేకత్తగా ఊహించని విధంగా నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ ని హిందీ తో పాటు ఇంగ్లీష్ తెలుగు తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. భవిష్యత్తులో ఏ ఐ టెక్నాలజీ సోషల్ మీడియా మనుషులను ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తాయి? ఎలా నియంత్రిస్తాయి? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ తో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో అనన్య పాండే తో పాటు విహాన్ సామ్రాట్ కూడా ప్రధాన పాత్రను పోషించారు. మరి ఒక ఏఐ మనిషి జీవితాన్ని ఎలా కంట్రోల్లోకి తీసుకుంది అనే ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…

నీలా అనే అమ్మాయి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన జాయ్ అనే అబ్బాయిని నీలా ప్రేమిస్తుంది. వీళ్ళిద్దరూ ప్రేమికులు మాత్రమే కాదు బిజినెస్ లో కూడా పార్టనర్స్. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా సెలబ్రేట్ చేసుకుంటారు కూడా. అయితే ఈ నేపథ్యంలోనే ఈ లవ్ బర్డ్స్ మధ్య గొడవలు మొదలవుతాయి. దీంతో నీలా కంట్రోల్ అనే ఏఐ ఆప్ లో లాగిన్ అవుతుంది. అందులో అలెన్ అనే ఏఐ మనిషిలా వీళ్లతో పరిచయం పెంచుకుంటుంది. అది వీళ్ల జీవితంలోకి వచ్చాక ఆమె జీవితం ఊహించని విధంగా మారిపోతుంది. తనకు నచ్చని జాయ్ మాయమైతాడు. ఇక మరోవైపు నీలా జీవితాన్ని తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది ఏఐ మనిషి. మరి దీనివల్ల నీలా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది? ఏఐ మనిషి కంట్రోల్ నుంచి తను ఎలా బయటపడింది? జాయ్ ఎక్కడికి వెళ్లాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ని చూడాల్సిందే. టైటిల్ని చూసి బో*ల్డ్ మూవీ అనుకున్నారేమో కానీ ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

Big Stories

×