OTT Movie : క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇంక ఎంతో సమయం లేదు. ఈ క్రిస్మస్ ని ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న క్రిస్మస్ సినిమాలను చూస్తూ సెలబ్రేట్ చేసుకోండి. ఫ్యామిలీలతో కలసి వీటిని చూసి ఇంటిల్లిపాది హాయిగా ఎంజాయ్ చేయండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ క్రిస్మస్ హాలిడే సినిమాల గురించి తెలుసుకుందాం పదండి.
శాంటా తో డేటింగ్ (Dating santa)
ఈ స్పానిష్ మూవీకి జోస్ సియరా దర్శకత్వం వహించారు. లెమన్ స్టూడియో ఈ మూవీని నిర్మించింది. ఒంటరి మహిళ లూసియా, చెఫ్ సెర్గియో ప్రేమలో పడుతుంది. అతను ఎవరోకాదు శాంటా. చిన్న పిల్లలను ఈ మూవీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అవుతోంది
డీలింగ్ విత్ క్రిస్మస్ (Dealing with Christmas)
2023లో రిలీజ్ అయిన ఈ ఫ్రెంచ్ మూవీకి ఆర్థర్ సానిగొ దర్శకత్వం వహించారు. క్రిస్మస్ ఈవ్‌లో ఒక మిషన్ కోసం, గ్రెగ్ తన కుమార్తెను పంపిస్తాడు. శాంటా క్లాజ్ అతనికి శిక్షకునిగా మారుతాడు. గ్రెగ్ కూడా ఈ రంగంలోకి ప్రవేశించడంతో మూవీ స్టోరీ రన్ అవుతుంది.
మెర్రీ లిటిల్ బ్యాట్ మాన్ (Merry little Batman)
2023లో రిలీజ్ అయిన ఈ మూవీకి మైక్ రోత్ దర్శకత్వం వహించాడు. యానిమేటెడ్ సూపర్ హీరో బ్యాట్ మాన్ అతని కుమారుడు డామియన్ వేన్ పాత్రలతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీకి యోనాస్ కిబ్రేబ్, ల్యూక్ విల్సన్, జేమ్స్ క్రోమ్‌వెల్, డేవిడ్ హార్న్స్‌బీ వాయిస్ అందించారు. ఈ మూవీలో డామియన్ తన తండ్రి మిషన్‌లో లేనప్పుడు, గోథమ్ సిటీలో క్రిస్మస్‌ను నాశనం చేయడానికి చూసిన జోకర్ పన్నాగాన్ని విఫలం చేస్తాడు డామియన్. ఈ మూవీ డిసెంబర్ 8, 2023 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
యువర్ క్రిస్మస్ ఆర్ మైన్? (Your Christmas or mine?)
2022 లో రిలీజ్ అయిన ఈ మూవీకి జిమ్ ఓహాన్లాన్ దర్శకత్వం వహించారు. ఇది ఒక బ్రిటిష్ క్రిస్మస్ రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇందులో ఆసా బటర్‌ఫీల్డ్, కోరా కిర్క్ జంటగా నటించగా, డేనియల్ మేస్, ఏంజెలా గ్రిఫిన్, హ్యారియెట్ వాల్టర్, డేవిడ్ బ్రాడ్లీ, నటాలీ గుమెడే, అలెక్స్ జెన్నింగ్స్, లూసీన్ లావిస్‌కౌంట్ సహాయక పాత్రల్లో కనిపించారు. తమ కుటుంభంలో జరిగే క్రిస్మస్ వేడుకలో కనిపించడం ద్వారా ఒకరినొకరు సర్ప్రైజ్ చేసుకొనే పాత్రలతో స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon prime video) లో డిసెంబర్ 2, 2022 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. విమర్శకుల ప్రశంశలు ఈ మూవీ అందుకుంది.
క్రిస్మస్ ఇన్ మియామీ (Christmas in Miami)
ఈ నైజీరియన్ కామెడీ మూవీకి రాబర్ట్ పీటర్స్ దర్శకత్వం వహించారు., ఈ మూవీ డిసెంబర్ 24, 2021న విడుదలైంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.