OTT Movie : యూత్ ని ఎంటర్టైన్ చేయాలంటే హాలీవుడ్ మూవీస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. థియేటర్లలో రిలీజ్ అయిన అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేవు. కొన్ని సినిమాలు మనసుకు హత్తుకుంటాయి. అటువంటి ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ హాలీవుడ్ మూవీలో హీరోయిన్ జైలులో పోలీస్ ఆఫీసర్ పై ప్రేమలో పడుతుంది. వీరిద్దరి చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు “డౌన్ బై లవ్” (Down by love). ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
యాన అనే ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్ తో కలిసి కొన్ని ఇల్లీగల్ ఆక్టివిటీస్ చేసి జైలుకు వెళుతుంది. ఆమెను కోర్ట్ రిమాండ్ కు పంపుతుంది. ఆ జైలులో కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. మిగతా జైలులా కాకుండా ఒక ఇంటిలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆమెకు కిచెన్ పని అప్పజెప్తాడు అక్కడున్న జైలర్. యాన బాగా అందంగా ఉండటంతో జైలర్ ఆమెకు అట్రాక్ట్ అవుతాడు. యానా కూడా జైలర్ తో క్లోజ్ గా ఉంటుంది. కిచెన్ వర్క్ నుంచి కంప్యూటర్ వర్క్ కి షిఫ్ట్ చేస్తాడు జైలర్. అక్కడ ఆమెను తాకుతూ ఉండగా ఆమె కూడా అతనికి సపోర్ట్ చేస్తుంది. వీరిద్దరూ జైలులోనే ఏకాంతంగా గడుపుతారు. ఈలోగా కోర్ట్ ఆమె చేసిన తప్పుకి 9 సంవత్సరాలు శిక్ష విధిస్తుంది. అయితే జైలర్ సత్ప్రవర్తన కారణంగా నువ్వు తొందరగానే జైలు నుంచి విడుదల అవుతావని ధైర్యం చెబుతాడు. అలా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏకాంతంగా గడుపుతూ ఉంటారు.
ఒకరోజు ఆమె తనను బయటకి తీసుకు వెళ్ళమని ఆ జైలర్ తో అడుగుతుంది. ఆ జైలర్ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆమెను బయటకు తీసుకువెళ్తాడు. అలా వాళ్లు ఒక హోటల్లో ఏకాంతంగా గడుపుతారు. ఈ విషయం జైలర్ భార్యకు తెలుస్తుంది. అయితే అదంతా అబద్ధం అని ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కొద్దిరోజుల తర్వాత యానా ప్రెగ్నెంట్ అవుతుంది. జైలర్ ని పై అధికారులు ఎంక్వయిరీ చేసి, అతనిని అరెస్టు చేస్తారు. అతనికి కూడా ఇలా చేసినందుకు మూడు సంవత్సరాల శిక్షను కోర్ట్ విధిస్తుంది. చివరికి యాన జైలర్ ల ప్రేమ ఎంతవరకు వెళుతుంది? ఈ విషయం తెలిసిన జైలర్ భార్య ఏం చేస్తుంది? యాన ఆ జైలు నుంచి విడుదలవుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “డౌన్ బై లవ్” (Down by love) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో ఆ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. మూవీ లవర్స్ ఈ మూవీని ఒంటరిగా చూడటమే బెట్టర్.