Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8 అనేది అన్‌లిమిటెడ్ ట్విస్టులు అనే ట్యాగ్‌లైన్‌తో మొదలయ్యింది. అలాగే ఎవరూ ఊహించని విధంగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ప్రవేశపెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు. అయితే ఈ ఎనిమిది మంది బిగ్ బాస్ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మునుపటి సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చినవారినే మరొకసారి బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్‌గా తీసుకొచ్చారు. వాళ్లు ఎంటర్ అయిన తర్వాత పాత కంటెస్టెంట్స్ అంతా ఓజీ టీమ్ అని, కొత్త కంటెస్టెంట్స్ అంతా రాయల్స్ టీమ్ అని విభజించారు. గత కొన్ని వారాలుగా కంటెస్టెంట్స్ మధ్య పాత, కొత్త అనే విభేదాలు తొలగిపోయాయి. కానీ తాజాగా గౌతమ్ అన్న మాట వల్ల మళ్లీ రాయల్స్ వర్సెస్ ఓజీ అనే చిచ్చు మొదలయ్యింది.
వైల్డ్ కార్డ్స్‌పై పగ
బిగ్ బాస్ 8లో చివరి మెగా చీఫ్ ఎవరు అవుతారు అనే దానికోసం పోటీ మొదలయ్యింది. ఇప్పటికే మెగా చీఫ్ కంటెండర్లుగా విష్ణుప్రియా, యష్మీ, టేస్టీ తేజ, పృథ్వి ఎంపికయ్యారు. చివరిగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. కంటెస్టెంట్స్‌లో ఎక్కువ మద్దతు ఎవరికి లభిస్తే వారే మెగా చీఫ్ కంటెండర్లు అవుతారని బిగ్ బాస్ తెలిపారు. దీంతో ముందుగా గౌతమ్‌కు తన అభిప్రాయం చెప్పే అవకాశం వచ్చింది. పాత కంటెస్టెంట్స్ అంతా కలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీలను బయటికి పంపించే ప్లాన్ జరిగిందని, అందుకే తను రోహిణికి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఆ తర్వాత కూడా మెజారిటీ కంటెస్టెంట్స్ వివిధ కారణాలు చెప్పి రోహిణికే సపోర్ట్ చేశారు. కానీ గౌతమ్ అన్న మాటలను నబీల్, పృథ్వి ఖండించారు.
Also Read: బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టికి గాయాలు.. అయ్యో పాపం పడిందా…
గ్రూపిజం చూపిస్తున్నారు
గౌతమ్ అన్న మాటలను ఒప్పుకోకుండా తనపై వాగ్వాదానికి దిగాడు పృథ్వి. అందరూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని, అది అందరికీ కనిపిస్తుందని గౌతమ్ ఆరోపించాడు. తను చెప్పిన పాయింట్‌ను వినకుండా పృథ్వి తనపైకి వచ్చాడు. వాడు, వీడు అంటూ అరిచాడు. అలా మాట్లాడకు అని గౌతమ్ చెప్తున్నా కూడా వినలేదు. దీంతో గౌతమ్‌కు కోపం వచ్చి ఏం పీకలేవు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అదే యాక్షన్‌లో చూపిస్తూ ఏం పీకగలనో చూపిస్తాను అంటూ మరింత సీరియస్ అయ్యాడు పృథ్వి. మధ్యలో విష్ణుప్రియా జోక్యం చేసుకోవడంతో ఇదే గ్రూప్ గేమ్ అంటున్నానని గౌతమ్ ఉదాహరణ ఇచ్చాడు. మొత్తానికి గొడవ ముగిసింది. రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయ్యింది.
ఎలా కాపాడుతున్నారో
టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ కలిసి గౌతమ్‌కు, పృథ్వికి మధ్య జరిగిన గొడవ గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. అసలు పృథ్వి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా, కంటెస్టెంట్స్‌తో మర్యాద లేకుండా ఉంటున్నా ప్రేక్షకులు తనను ఇన్ని వారాలుగా ఎలా కాపాడుతున్నారో అస్సలు అర్థం కావడం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు అవినాష్. ప్రేక్షకులు తనను ఇంకా కాపాడుతున్నారు కాబట్టే పృథ్వికి ఎలాగైనా మాట్లాడొచ్చు అనే ధైర్యం వచ్చిందని అన్నాడు. గౌతమ్, పృథ్వి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు గౌతమ్ అక్కడే నిలబడి ఉన్నా పృథ్వి మాత్రం తన పైకి వస్తున్నాడని తెలిపాడు. దీంతో క్లియర్‌గా ఇదంతా రౌడీయిజం, గుండాయిజం అని తేజ అన్నాడు.