OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఏ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందో? పేరేమిటో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ఎంపైర్ ఆఫ్ ఫ్యాషన్” (Empire of passion). పేదవాడైన ఒక వ్యక్తి కుటుంబం కోసం రిక్షా తొక్కుతూ కష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఇంటిదగ్గర ఒంటరిగా ఉన్న భార్య మీద మరొక వ్యక్తి మనసు పడటం వల్ల ఆ కుటుంబం ఏమవుతుందో ఈ మూవీ స్టోరీలో తెలుసుకోండి. ప్రస్తుతం ఈ మూవీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
కిమ్ తన కుటుంబం పోషణ కోసం రిక్షా తొక్కుతూ ఉంటాడు. పొద్దున వెళ్లిన ఇతను రాత్రికి వస్తుంటాడు. వీళ్లకు ఒక కొడుకు కూడా ఉంటాడు. భార్య అప్పుడప్పుడు ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి సహాయం గా ఉంటుంది. ఇలా వీరి సంసారం సజావుగా సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కిమ్ ఇంటికి దగ్గరలో ఉన్న బిన్స్ అనే వ్యక్తి కన్ను కిమ్ భార్యపై పడుతుంది. ఆమె అందంగా ఉండటంతో ఆమెను ఎలాగైనా అనుభవించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో కిమ్ బయటికి వెళ్లిన తర్వాత ఆమె కోసం ఆ ఇంటికి వస్తూ ఉంటాడు. ఆమెకు కావలసిన ఆహార పదార్థాలను అందిస్తుంటాడు. ఒకరోజు ఎవరూ లేని సమయం చూసుకొని ఆమెను బలవంతం చేస్తాడు. అయితే ఆమె కూడా భర్తకు ఎక్కువ కాలం దూరంగా ఉండటంతో కాదనలేక పోతుంది. ఇలా ఒకరికొకరు బాగా అలవాటు పడిపోతారు. బిన్స్ ఆమెతో మనం ఇంకా సంతోషంగా ఉండాలంటే, నీ భర్తని చంపేస్తే సరిపోతుందని అంటాడు. ఆమె కూడా ఇతనికి బాగా అలవాటు పడటంతో సరేనని ఒప్పుకుంటుంది.
ఒకరోజు రిక్షా తొక్కి ఇంటికి వచ్చిన భర్తకి మందు బాగా తాపిస్తుంది. ఆ తర్వాత అతను మత్తులోకి జారుకున్న తర్వాత బిన్స్ తో కలసి భర్తని చంపేస్తుంది. ఆ శవాన్ని ఇద్దరూ కలసి ఒక బావిలో పడేస్తారు. కొద్దిరోజుల తర్వాత ఆ శవం ఆత్మలా మారి వీళ్ళిద్దరికీ కనపడుతూ ఉంటుంది. కిమ్ ఆత్మను చూసి వాళ్లు భయపడుతూ ఉంటారు. ఈ విషయం మూడు సంవత్సరాల పాటు దాచిపెడుతుంది. భర్త జపాన్ లో ఉన్నాడంటూ అందరినీ నమ్మిస్తుంది. అయితే ఆ ఊరి ప్రజలకు ఈమెపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ వీళ్లను అనుమానిస్తాడు. చివరికి పోలీస్ ఆఫీసర్ వీళ్లు చేసిన మర్డర్ ని వెలుగులోకి తెస్తాడా? వీరి అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంటుందా? కిమ్ దయ్యం రూపంలో వచ్చి వీళ్ళ మీద పగ తీర్చుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.