Rohit Sharma Baby: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) ఇంట సంబరాలు మొదలయ్యాయి. రోహిత్ శర్మ ( Rohit Sharma) రెండోసారి.. తండ్రి కావడం జరిగింది. రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే ( Ritika Sajdeh) నవంబర్ 15 అంటే శుక్రవారం ముంబైలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ జంటకు గతంలో 2018లో సమైరా అనే చిన్నారి ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: IND vs SA 4th T20i: సౌతాఫ్రికా చిత్తు..135 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ !
Also Read: Tim Southee Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టిమ్ సౌథీ..18 ఏళ్ల కెరీర్ కు ముగింపు !
ఇక సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత, రెండవ బిడ్డకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ – రితిక సజ్దే ( Ritika Sajdeh) దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ జంట ముంబైలో శుక్రవారం (నవంబర్ 15) తమ రెండవ బిడ్డకు స్వాగతం పలికారు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma)…తన భార్య రితిక సజ్దే ( Ritika Sajdeh) డెలివరీ ఉన్న నేపథ్యంలోనే టీమిండియా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లలేదు. అంతేకాదు…నవంబర్ 22న ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ మ్యాచ్ కు కూడా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma)…దూరం అవుతాడని అన్నారు.
Also Read: KL Rahul – Mumbai Indians: RCBకి ఎదురుదెబ్బ… ముంబైలోకి కేఎల్ రాహుల్.. ఓపెనర్ గా ప్రమోషన్ ?
దీంతో మొదటి టెస్ట్ మ్యాచ్ కు జస్ర్పత్ బుమ్రాను కెప్టెన్ చేస్తారని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ నుంచి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) అందుబాటులో ఉంటాడని కూడా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే… నవంబర్ 22న ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ మ్యాచ్ కు ముందే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) తండ్రి అయ్యాడు.
Also Read: Shikhar Dhawan – NPL 2024: ఐపీఎల్ కు గుడ్ బై..నేపాల్ కు వెళ్లిపోతున్న శిఖర్ ధావన్ ?
దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ( Rohit Sharma) ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తనకు కొడుకు పుట్టడంతో…. కుటుంబంతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు రోహిత్ శర్మ. ఇక అటు రోహిత్ శర్మ రెండో సారి తండ్రి కావడంతో… అతనికి అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా రోహిత్ శర్మ , రితికా సజ్దేల వివాహం డిసెంబర్ 13, 2015న జరిగింది. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) కు జూనియర్ రోహిత్ శర్మ వచ్చాడని టీమిండియా క్రికెటర్లు కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతున్నారట.
Also Read: Arjun Tendulkar: భయంకరమైన బౌలింగ్ తో రెచ్చిపోయిన సచిన్ కొడుకు..వేలంలో భారీ ధర పక్కా !