TDP on Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు తొందరపడ్డారా.. చేసిన సవాల్ కి కట్టుబడి ఉంటారా.. ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా.. ఏమో కానీ అంబటి సవాల్ కు మాత్రం టీడీపీ ఇచ్చిన రిప్లై కి మాత్రం ఆయన దిమ్మతిరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఇటీవల ఏపీలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో హద్దులు దాటిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టకుండా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా.. ఒక్కొక్కరిని వెలికితీస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు.
ఈ అరెస్టులపై వైసీపీ భగ్గుమంటుండగా, టీడీపీ మాత్రం మహిళల వ్యక్తిగత హనానికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని చెబుతోంది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ పర్వంపై ఓ ట్వీట్ చేశారు. అసలు కేసులు నమోదు చేయాలంటే ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు పై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు ఎందుకు పెట్టకూడదో తెలపాలంటూ ప్రశ్నించారు.
ఇక్కడే అంబటి రాంబాబు ఓ సవాల్ విసిరారు నారా లోకేష్ కి. శాసనసభలో తన తల్లిని అవమానించారంటూ నిన్న లోకేష్ చేసిన వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ.. మీ తల్లిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయాలకు స్వస్తి పలుకుతానని అంబటి అన్నారు. ఇదే ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారింది.
అంబటి సవాల్ ను లోకేష్ కంటే ముందే టీడీపీ సోషల్ మీడియా స్వీకరించింది. ఇదిగో ఆధారాలు అంటూ వీడియోలతో సహా, ఏకంగా అంబటికే ట్యాగ్ చేశారు. ఆధారాలు చూయించాం.. ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పే డేట్ ఎప్పుడూ అంటూ సోషల్ మీడియా, అంబటి కి షాకుల మీద షాకులు ఇస్తోంది. సోషల్ మీడియా విడుదల చేసిన వీడియోలో మాజీ ఎమ్మేల్యే వంశీ, అంబటి రాంబాబు ఇద్దరూ కూడా లోకేష్ తల్లి గురించి వ్యాఖ్యానించారు. ఆ వీడియోలోనే నాడు సీఎం చంద్రబాబు కన్నీటి పర్యంతమైన వీడియోను కూడా విడుదల చేశారు.
చెప్పిన మాటకు అంబటి కట్టుబడి ఉంటారా లేదా.. రాజకీయాలకు ఇక గుడ్ బై చెప్పే డేట్ ఎప్పుడంటూ.. సోషల్ మీడియా కోడై కూస్తోంది. లోకేష్ స్పందించడం ఏమో కానీ సోషల్ మీడియా మాత్రం యమ ఫాస్ట్ గా రిప్లై ఇవ్వడం మాత్రం షాక్ అనే చెప్పవచ్చు. మరి ఈ కామెంట్స్ పై అంబటి రాంబాబు రియాక్షన్ ఎలా ఉండబోతోందో వేచిచూడాలి.
ఇదిగో చూడు … సిగ్గు తెచ్చుకో Nov 19 2021.
మనుషులేనా మీరు? రాక్షసజాతికి చెందిన వాళ్ళు మీరు. 🤮 https://t.co/Dn0Devaq1q pic.twitter.com/KlJjT82ITL
— AP with CBN (@I_am_with_cbn) November 15, 2024