OTT Movie : ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూడాలంటే థియేటర్లకే వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత బుల్లితెరలో సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ అందుబాటులో ఉంది. వీటిలో అన్ని జానర్ లలో సినిమాలు వస్తున్నాయి. అయితే కొన్ని అభ్యంతకరమైన సన్నివేశాలు ఉన్నాయని, అప్పట్లో ఒక మూవీని ఇండియాలో బ్యాన్ చేశారు. రాజకీయ దుమారం రేపిన ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
యూట్యూబ్ (Youtube)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ మూవీ పేరు ‘ఫైర్‘ (Fire). దీపా మెహతా దర్శకత్వం వహించిన ఈ మూవీలో షబానా అజ్మీ, నందితా దాస్ నటించారు. స్వలింగ సంపర్క సంబంధాలను స్పష్టంగా చూపించిన మొదటి బాలీవుడ్ మూవీ ఫైర్. తోడికోడళ్ళు లెస్బియన్ సంబంధాన్ని పెట్టుకొని, తమ భర్తలని ఎదుర్కొనే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది. లెస్బియన్ లుగా మారే తోడికోడళ్ళ ఏకాంత సన్నివేశాలు దుమారం రేపడంతో, ఈ మూవీని ఇండియాలో బ్యాన్ చేశారు.
స్టోరీలోకి వెళితే
సీత, జితిన్ పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్తారు. సీత సంతోషంగా ఉండగా, జితిన్ మాత్రం ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటాడు. అదిగమనించిన సీత నేనంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. పెళ్లి జరిగింది ఇప్పుడే కదా అంటూ దాట వేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన జితిన్ తన గర్ల్ ఫ్రెండ్ తో బిజీగా ఉంటాడు. భార్యను కేవలం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే వాడుకుంటాడు. వీళ్ళు ఉండే ఇంట్లోనే జితిన్ అన్న అశోక్ అతని భార్య రాధా కూడా ఉంటారు. అయితే అశోక్ ఒక స్వామిజి మాయలో పడిపోతాడు. ఆ స్వామీజీ పిల్లలు పుట్టేంతవరకు మాత్రమే ఏకాంతంగా గడపాలని, ఆ తర్వాత దైవ సన్నిధికి రావాలని చెప్తాడు. స్వామీజీ మాటలు విన్న అశోక్ భార్యతో దూరంగా ఉండిపోతాడు. భార్యకు మాత్రం ఒంటరిగా ఉండలేక సతమతమవుతూ ఉంటుంది. మరోవైపు జితిన్ కూడా భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడంతో సీతా, రాధ ఒకరికి ఒకరు దగ్గరవుతారు. వీళ్ళిద్దరూ తమ కోరికలను తీర్చుకుంటూ హ్యాపీగా ఉంటారు. అయితే అదే ఇంట్లో ఉండే ఒక పనివాడు బూతు క్యాసెట్లను చూస్తూ స్వయంతృప్తి పొందుతూ ఉంటాడు. అదిచూసి రాధ అతన్ని మండలిస్తుంది.
ఆమె మీద కోపం పెంచుకున్న పనివాడు, సీత, రాధ ఏకాంతంగా గడిపే సన్నివేశాన్ని చూసి అశోక్ కి చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు అశోక్. అయితే అప్పటికే వాళ్ళిద్దరూ బట్టలు లేకుండా ఉండటం చూసి, ఇలా చేయడం తప్పు అంటూ భార్యకు చెప్తాడు. నేను తప్పు చేయలేదు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంటూ రాధ ధైర్యంగా చెప్తుంది. మేమిద్దరం బయటికి వెళ్లి హ్యాపీగా బతుకుతాం అంటూ వెళ్లడానికి సిద్ధపడుతుంది. అయితే మీకు కోరికలే కావాలంటే నేను చేస్తానంటూ అశోక్ రెచ్చిపోతాడు. ఈ క్రమంలో రాధ చీరకు నిప్పంటుకుంటుంది. ఇది చూసి ఆమెను కాపాడుకుండా భర్త సైలెంట్ గా ఉండిపోతాడు. చివరికి సీత, రాధ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతారా? మంటల్లో చిక్కుకొని రాధ ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ రొమాంటిక్ మూవీని తప్పకుండా చూడండి.