BigTV English

Vijay Devarakonda : 2025 లో విజయ్ దేవరకొండ పెళ్లి.. ఎప్పుడు, ఎక్కడంటే?

Vijay Devarakonda : 2025 లో విజయ్ దేవరకొండ పెళ్లి.. ఎప్పుడు, ఎక్కడంటే?

Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు తన టాలెంట్ తో ఎన్నో సినిమాలు చేశాడు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా కూడా మరికొన్ని మూవీస్ మంచి కలెక్షన్ ను అందుకున్నాయి. రౌడీ హీరోగా ఆయన ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ సినిమాల కన్నా ఎక్కువగా పెళ్లి రూమర్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది విజయ్ దేవరకొండ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయం ఏంటో ఒకసారి చూసేద్దాం..


విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి పెళ్లి చూపులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీ వచ్చింది. భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత దానికి మించిన హిట్‌ని దర్శకుడు పరశురాం పెట్లతో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా గీతా గోవిందంతో అందుకున్నాడు. ఇక్కడి నుంచి ఆ సినిమా హీరోయిన్ రష్మికతో డియర్ కామ్రేడ్ కూడా చేసాడు. కాగా ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై పలు రూమర్స్ మొదలయ్యాయి.. రష్మిక మందన్నతో విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నాడుంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇపుడు దాదాపు ఇద్దరూ ఓపెన్ కూడా అయ్యిపోయారు. సోషల్ మీడియాలో ఇద్దరూ సెపరేట్‌గా ఫొటోస్ షేర్ చేసుకున్నప్పటికీ ఇద్దరూ ఒకే దగ్గర ఉండడం కొసమెరుపు. ఇక రీసెంట్ గా పుష్ప 2 ఈవెంట్ లో కూడా తన రిలేషన్ షిప్ పై రష్మిక ఓపెన్ గా ఎవరో మీకు తెలుసు అని ఓపెన్ అయ్యింది. దాంతో ఆ రూమర్స్ నిజమే అని నమ్ముతున్నారు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ కూడా ఓ ఇంటర్వ్యూ లో రిలేషన్ పై త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పాడు. ఏదానికైనా ఒక సమయం ఉంటుంది. త్వరలోనే చెప్తాను అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు.. రజినీకాంత్‌పై రీసెంట్‌గా ట్రెండ్ అయ్యిన ఓ వీడియో మీమ్ తో తన పెళ్లిపై స్పందించాడు. అందులో ఈ 2025లో అయినా పెళ్లి చేసుకుంటావా అంటే దానికి తన రియాక్షన్ గా రజినీకాంత్ ఏమీ చెప్పలేని విధంగా ఎక్స్ ప్రెషన్స్ పలికించే వీడియోని తన పెళ్లిపై పోస్ట్ చేసాడు విజయ్. అయితే ఈ 2025లో కూడా పెళ్లి విషయంలో ఓ క్లారిటీతో తాను లేడా అనిపిస్తుంది..


ఇకపోతే తన పెళ్లి విషయంలో కుటుంబం కూడా ప్రెజర్ పెడుతున్నట్టే ఈ పోస్ట్ తో తన హావభావాలని తాను చూపించాడని చెప్పాలి. ఇలా మొత్తానికి అయితే పెళ్లి విషయంలో విజయ్ దేవరకొండ పరిస్థితి ఏదో తేడాగానే ఉందని అనుకోవచ్చు.. మొత్తానికి అయితే తమ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఫామ్ హౌస్ లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట.. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఉన్నాయని టాక్..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×