E-Paper
Advertisement

OTT Movie : పబ్బులో కళ్ళు తిరిగి పడిపోయే అమ్మాయిలను ఏం చేస్తారంటే… ట్విస్ట్ లతో మతి పోగొట్టే తమిళ్ థ్రిల్లర్ మూవీ

OTT Movie : పబ్బులో కళ్ళు తిరిగి పడిపోయే అమ్మాయిలను ఏం చేస్తారంటే… ట్విస్ట్ లతో మతి పోగొట్టే తమిళ్ థ్రిల్లర్ మూవీ
Advertisement

OTT Movie : సస్పెన్స్ జానర్ లో వచ్చే సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలలో వచ్చే ట్విస్టులతో మూవీ లవర్స్ ఎక్కువగా థ్రిల్ అవుతారు. ఈ థ్రిల్లర్ సినిమాలు స్టార్టింగ్ నుంచి చివరి వరకు సస్పెన్స్ సన్నివేశాలతో అలరిస్తాయి. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక సస్పెన్స్ మూవీ ఈరోజు మూవీ సజేషన్లో తెలుసుకుందాం. ఈ మూవీ పేరెమిటో? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో

Advertisement

ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘యూత సతం‘ (Yutha Satham). ఈ మూవీలో ఒక అమ్మాయి మర్డర్ మిస్టరీ కేసును పోలీస్ ఆఫీసర్ చేదించే క్రమంలో కొన్ని రహస్యమైన విషయాలను వెలికి తీస్తాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

కబీర్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉంటాడు. కూతురు చనిపోవడంతో కొన్ని రోజులు లీవ్ పెట్టి మళ్ళీ డ్యూటీ లోకి వస్తాడు. ఇతడు డ్యూటీలో ఉండగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. రాఘవి అనే ఒక అమ్మాయి కబీర్ ని స్టేషన్ లో అడిగి బయటికి వెళుతుండగా, ఎవరో వ్యక్తి ఆమెను చంపి వెళ్ళిపోతాడు. ఈ విషయం కబీర్ కి ఫోన్ చేసి చెప్తారు కానిస్టేబుల్స్. కబీర్ ఆమె కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో నగలన్ అనే వ్యక్తిపై అనుమానం పెంచుకుంటాడు కబీర్. నగలన్ చనిపోయిన అమ్మాయి బాయ్ ఫ్రెండ్. రాఘవి ఇంటికి వెళ్లిన కబీర్ కి ఆ ఇంట్లో పనిమనిషి పారిపోతుండగా పట్టుకుంటాడు. అయితే ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ అని చెప్తుంది. తమ కంపెనీకి రావాల్సిన ఒక ప్రాజెక్టు రాఘవికి వెళ్లిందని, దాని డీటెయిల్స్ తెలుసుకుందామని పనిమనిషిగా వచ్చానని చెప్తుంది. ఆ కంపెనీ యజమాని దగ్గరికి వెళ్లి కన్ఫర్మ్ చేసుకుంటాడు కబీర్. అయితే ఈ హత్య చేసింది ఎవరు అని సందేహంలో ఉండగా, రాఘవి ఫ్రెండ్స్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటాడు కబీర్.

రాఘవి కొంతమంది అమ్మాయిలను హాస్పిటల్ కి తీసుకువచ్చేది. తీసుకువచ్చిన వాళ్ళల్లో కొంతమంది చనిపోతారు. ఎందుకు అలా చనిపోతున్నారో రాఘవి కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. వీళ్ళు వెళ్ళే పబ్బులో ఒక మ్యూజిక్ ప్లే చేయడంతో అమ్మాయిలు స్పృహ కోల్పోతూ ఉంటారు. ఆ తర్వాత అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ విషయం రాఘవి తెలుసుకొని ఉంటుంది. ఆ తర్వాతనే ఈ హత్య జరుగుతుంది. చివరికి రాఘవిని హత్య చేసిన వాళ్ళని కబీర్ పట్టుకుంటాడా? ఆ పబ్బులో జరిగే విషయాలను వెలికి తీస్తాడా? రాఘవి బాయ్ ఫ్రెండ్ కి ఈ విషయంలో సంబంధం ఉందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘యూత సతం’ (Yutha Satham) ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×