OTT Movie : ఎన్ని సినిమాలు చూసినా అందులో రొమాన్స్ ఉంటేనే మజా ఎక్కువగా ఉంటుంది. రొమాన్స్ అంటే ఎక్కువగా గుర్తుకొచ్చేది హాలీవుడ్ సినిమాలు. ఈ సినిమాలలో వచ్చే సీన్స్ మరో లోకంలోకి తీసుకెళ్తాయి. అటువంటి సీన్స్ తో పాటు, మంచి స్టోరీ ఉండే ఒక మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘ఫ్రిదా‘ (Frida) . ఈ మూవీలో హీరోయిన్ బొమ్మలు వేసే ఒక పెయింటర్ తో జీవితాన్ని గడపాలనుకుంటుంది. అయితే అయితే అతడు కనిపించిన అమ్మాయితో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వీరిద్దరి మధ్య సాగే ఈ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
ఫ్రిదా తన ఇంట్లో అల్లారి ముద్దుగా పెరుగుతుంది. వయసుకు వచ్చాక ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. అయితే ఫ్రిదాకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. డేవిడ్ అనే ఫేమస్ పెయింటర్ ని కలవాలి అనుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమెకు యాక్సిడెంట్ అవుతుంది. కొన్ని నెలల పాటు మంచానికే పరిమితం అవుతుంది. ఆ సమయంలో బాయ్ ఫ్రెండ్ కూడా ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఒంటరిగా బాధపడుతున్న కూతురిని చూసి తండ్రి కొన్ని పెయింట్స్ వేయడానికి వస్తువులు తీసుకొస్తాడు. ఈ సమయంలో అదే బెటర్ అనుకొని ఫ్రిదా బొమ్మలు వేస్తుంది. మరి కొంతకాలానికి కోలుకున్న ఈమె డేవిడ్ ని కలవడానికి వెళుతుంది. ఈమె వేసిన పెయింటింగ్స్ ని అతనికి ఇస్తుంది. ఆ పెయింటింగ్స్ చూసి అతడు ఆమెను చాలా మెచ్చుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరికీ పరిచయం అవుతుంది. తన ఆర్ట్ గ్యాలరీలో ఈమెకు స్థానం కల్పిస్తాడు. అయితే డేవిడ్ కి ఇదివరకే పెళ్లి అయిపోయి ఉంటుంది. ఇతడు అమ్మాయిలతో చాలా క్లోజ్ గా ఉంటాడు. ఇతడు దూరంగా ఉన్నా అమ్మాయిలు మాత్రం ఇతనికి దగ్గరవుతూ ఉంటారు అలా ఉంటుంది ఇతని సుడి.
ఈ క్రమంలో ఒకరోజు ఫ్రిదాతో డేవిడ్ ఏకాంతంగా గడుపుతారు. అలా నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ ఫ్రిదాని కోరుతాడు. ఉన్న భార్యకి విడాకులు ఇచ్చి ఫ్రిదాను పెళ్లి చేసుకుంటాడు. అయితే అతనిలో మార్పు మాత్రం ఏమీ ఉండదు. ఆమెను పెళ్లి చేసుకున్నాక, వేరే అమ్మాయిలతో కూడా రిలేషన్ పెట్టుకుంటాడు. అతని గురించి తెలిసి ఫ్రిదా కూడా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతుంది. అయితే ఒకసారి ఫ్రిదా అక్క వీళ్ళు ఉండే స్టూడియోకి వస్తుంది. ఆమెతో కూడా అతడు ఏకాంతంగా గెలుస్తాడు. వీరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఫ్రిదా అక్కడికి వస్తుంది. డేవిడ్ని అసహ్యించుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత టాక్సిన్ అనే వ్యక్తి ని డేవిడ్ ఫ్రిదాకి పరిచయం చేస్తాడు. కమ్యూనిస్టు లీడర్ కావడంతో అతన్ని కొంతమంది వెంటాడుతూ ఉంటారు. అతనికి ఫ్రిదా ఆశ్రయం ఇస్తుంది. టాక్సిన్ ను కొంతమంది దుండగులు చంపేస్తారు. పోలీసులు ఆమెను ఎంక్వయిరీ చేస్తారు. చివరికి ఫ్రిదా ఈ కేసు నుంచి బయట పడుతుందా. డేవిడ్ తో మళ్ళీ కలసి బ్రతుకుతుందా? డేవిడ్ తన వంకర బుద్ధిని మార్చుకుంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఫ్రిదా మూవీని మిస్ కాకుండా చూడండి.