OTT Movie : రొమాంటిక్ సస్పెన్స్ సినిమాలు మొదటినుంచి చివరివరకూ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అందులోనూ మలయాళం మూవీస్ అంటే రొమాంటిక్ కంటెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సస్పెన్స్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. లవ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఒక సస్పెన్స్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లోస్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…
యూట్యూబ్ (YouTube)
ఈ సస్పెన్స్ మలయాళం మూవీ పేరు ‘పరంకిమాల‘ (ParankiMala). ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి పెద్దలు ఒప్పుకోకపోతే, లేచిపోయి పెళ్లిచేసుకోవాలనుకుంటారు ఒక జంట. అయితే ఆ అమ్మాయి వేరొకరితో వెళ్లిపోవడంతో హీరో బాధపడుతుంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమవుతుందనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ రొమాంటిక్ సస్పెన్స్ మూవీ యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
అప్పు, అణు అనే అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో అప్పు ఇంట్లోనుంచి బయటికి వస్తాడు. అణు కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. అయితే అదే ఊరిలో ఉండే వేణు అనే సారాయి వ్యాపారి అణుని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పు రాత్రంతా ఆమె కోసం వెయిట్ చేస్తాడు. ఎంతవరకూ ఆమె రాకపోవడంతో మళ్లీ ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే అణు ఎవరితోనో లేచిపోయిందని ఊరంతా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అప్పు ఈ విషయం మొదట అంతగా నమ్మడు. మరోవైపు వేణు అణుని ఒకచోట బంధిస్తాడు. పెళ్లి చేసుకోకుండానే మొగుడిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మొదటినుంచి వేణుకి అను మీద కన్ను ఉంది. వేణు అణుని వేధించడంతో, అప్పుకి వేణుకి మధ్య గొడవలు కూడా జరిగాయి. అణు, అప్పుని ప్రేమిస్తుండటంతో ఎలాగైనా అణుని సొంతం చేసుకోవాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోతాడు.
అయితే ఒకరోజు వేణు దగ్గరికి కుంజమోలు అనే వ్యాపారి వస్తాడు. సారాయి వ్యాపారంలో వేణు కి హెల్ప్ చేసే పెద్దమనిషి ఇతను అణుని చూసిన కుంజమోలు వేణుతో నీ అప్పు తీరాలంటే ఆమెను నా దగ్గరికి పంపాలని చెప్తాడు. ఈ విషయమై అణుని అతనితో గడపమని అడుగుతాడు వేణు. అందుకు అణు నిరాకరిస్తుంది. వేణుని అణు బాగా తిట్టడంతో, కోపం తెచ్చుకొని వేణు గట్టిగా కొడతాడు.అప్పుడు ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈ క్రమంలో ఆమెతో గడపడానికి కుంజమోలును లోపలికి పంపిస్తాడు వేణు. అతనితోపాటు అతని దగ్గర ఉన్న ఇద్దరు పని వాళ్లు కూడా ఆమెపై అఘాయిత్యం చేస్తారు. మేలుకువలోకి వచ్చిన ఆ అమ్మాయి జరిగింది గ్రహిస్తుంది. చివరికి అణు పరిస్థితి ఏమవుతుంది? అప్పుకి ఈ విషయం తెలుస్తుందా? అఘాయిత్యం జరిపిన వాళ్లపై అణు ప్రతీకారం తీర్చుకుంటుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ (YouTube) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పరంకిమాల’ (ParankiMala) అనే ఈ సస్పెన్స్ మలయాళం మూవీని చూడాల్సిందే.