BigTV English

 OTT Movie : రోజుకొకరు చనిపోయే వింత ఊరు… మెంటలెక్కించే హార్రర్ మూవీ

 OTT Movie : రోజుకొకరు చనిపోయే వింత ఊరు… మెంటలెక్కించే హార్రర్ మూవీ

OTT Movie : హర్రర్ మూవీస్ అంటే పడి చచ్చే వారికోసం ఈరోజు ఒక క్రేజీ మూవీ గురించి మన మూవీ సజెషన్లో చెప్పుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా పంటలు పండే సమయానికి ఆ ఊర్లో కాలు పెడితే తిరిగిరారు. ఎవరైనా చనిపోయే ముందు దెయ్యాలు కనిపించి హింట్ ఇస్తాయి. హర్రర్ స్టోరీ ఏ ఓటీటీ లో అందుబాటులో ఉంది? మూవీ పేరేంటి? ఈ విషయాలను తెలుసుకుందాం పదండి.


ప్లెక్స్ (Plex)

ప్రస్తుతం ఓటీడీలో ఎన్నో హర్రర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే మెంటల్ ఎక్కించే ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీ తో ఆసక్తికరంగా సాగుతాయి. ఇలాంటి సినిమాలు కోసం వెతుకుతున్నట్టయితే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీ ప్రస్తుతం ప్లెక్స్ (Plex) అనే ఒక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు “ఐ నో వెన్ యు ఆర్ గోయింగ్ టు డై  : సూసైడ్ విలేజ్” (I know when you are going to die : suicide village). ఇండోనేషియన్ హర్రర్ మూవీ ని సింగిల్ గా చూశారంటే చలికాలంలో కూడా భయంతో చెమటలు పట్టడం ఖాయం.


కథలోకి వెళ్తే…

సినిమా స్టార్టింగ్ లోనే హీరోయిన్ కి ఒక పిల్ల దయ్యం కనిపిస్తుంది. ఆ దెయ్యం ఓ ముసలావిడను చూపిస్తుంది. నిజానికి ఆ ముసలావిడ తన బామ్మ. పిల్ల దయ్యం అలా చూపించగానే ఆ ముసలావిడ యాక్సిడెంట్ అయ్యి చనిపోతుంది. ఇలా హీరోయిన్ కి ముందుగానే ఎవరైనా చనిపోయే ముందు దెయ్యాలు కనిపించి హింట్ ఇస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ తన ఫ్రెండ్ తో కలిసి ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ కి ఒక కాల్ ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో ఓ వ్యక్తి నువ్వు ఊరుని కాపాడతానన్నావు, ఎంత దూరం పారిపోయిన సరే చావు నుంచి తప్పించుకోలేవు అని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్లే క్రమంలో ఆ వ్యక్తి ఎవరు? అతనికి తన ఫ్రెండ్ తెలుసా అనే విషయాన్ని కనిపెట్టాలని అనుకుంటుంది. అంతలోపే హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి తనను తీసుకెళ్లి పోతుంది. ఆ వ్యక్తి ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్ రూమ్ లోకి వెళితే అక్కడ ఒక దయ్యం కనిపించి చంపడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఆ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకడానికి ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ కి ఇలాంటి సంఘటనలు జరిగే ముందు దయ్యాలు ముందే కనిపించి హింటిస్తాయి కదా.. ఇతని విషయంలో అలాంటిదేమీ జరగకపోవడంతో అతను చనిపోడని అనుకుంటుంది.

విచిత్రంగా అతను పైనుంచి దూకి చనిపోతాడు. దీంతో డిస్టర్బ్ అయిన హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ ఫ్రెండ్ రూమ్ లో కనిపించదు. అక్కడే ఉండే మరో ఆవిడ నిన్న చనిపోయిన అతను ఆ అమ్మాయికి సంబంధించిన ఊరు వ్యక్తి కావడంతో, అతని శవాన్ని తీసుకొని ఊరికి వెళ్ళిపోయిందని చెప్తుంది. అదే రోజు రాత్రి హీరోయిన్ కి కలలో ఆ చనిపోయిన వ్యక్తితో పాటు తన ఫ్రెండ్ శవాలను పంట పొలాల్లో దిష్టిబొమ్మల్లా పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఉలికి పడి నిద్ర లేచిన హీరోయిన్ తన ఫ్రెండ్ కి ఆపద ఉందని భావించి ఆమె ఊరికి మరో ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్తుంది. అయితే మధ్యలోకి వెళ్ళగానే ఒక ఊరిలో ఆగుతారు. ఆ టైంలో పంటలు పండే టైంలో ఆ ఊర్లోకి ఎవరు వెళ్లకూడదని, ఆ ఊర్లో రోజుకొకరు చనిపోతారని తెలుసుకుని షాక్ అవుతారు. అసలు హీరోయిన్ ఫ్రెండ్ ఊర్లో అసలు ఏం జరుగుతోంది? ఎందుకు అక్కడ రోజుకొకరు చనిపోతున్నారు? ఊరికి వెళ్ళగానే హీరోయిన్ కి దయ్యాలు కనిపించడం ఎందుకు మానేశాయి? ఈ విషయాలు తెలియాలంటే ఈ సినిమాపై ఒక లుక్ వెయ్యండి.

Related News

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

OTT Movie : డబ్బు కోసం డర్టీ గేమ్స్… ప్రపంచ కుబేరుడిని బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టే రూత్లెస్ థీఫ్… నెవర్ బిఫోర్ హీస్ట్ థ్రిల్లర్

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

OTT Movie : 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ కు పవర్స్… ఒక్కొక్కడినీ చిత్తుచిత్తుగా కొట్టి తరిమేసే పిల్ల పిశాచాలు… పిల్లలకు పండగే

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా

Big Stories

×