BigTV English

Gangster Movie Review : ‘గ్యాంగ్ స్టర్ ‘ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Gangster Movie Review :  ‘గ్యాంగ్ స్టర్ ‘ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

నటీనటులు – చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంఛన్, అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ, డి. యస్. రావు, గిరి పోతురాజు, నవీన్ ఆర్యాన్ తదితరులు


సమర్పణ – రవి అండ్ నరసింహా,

బ్యానర్ – వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్,


ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత దర్శకత్వం- చంద్రశేఖర్ రాథోడ్

కెమెరామెన్ : జి. యల్ .బాబు

కో డైరెక్టర్.. విజయ్ సారధి

పీఆర్ఓ – శ్రీపాల్ చొల్లేటి

చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “గ్యాంగ్ స్టర్”. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ గ్యాంగ్ స్టర్ ‘.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 25 న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “గ్యాంగ్ స్టర్’ చిత్రం ఎలా ఉందో జనాలు ఎలాంటి రెస్పాన్స్ ను ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ..

ఈ మూవీ మొత్తం గోవా బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న కథే ‘ గ్యాంగ్ స్టర్’.ఫ్రెండ్స్ గా ఉన్న డేవిడ్(సూర్యనారాయణ), జేమ్స్ (అడ్ల సతీష్ ) లు సిటీ లో పెద్ద గ్యాంగ్ స్టర్స్. సిటీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకొని సిటీకి కింగ్ మేకర్ అవ్వాలని ఒకరికొకరు ఆశతో ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరూ బద్ద శత్రువులుగా మారతారు. కానీ వీళ్ళు సమాజంలో ఉండే రూల్స్ కాకుండా వాళ్ళ మధ్యలో డిఫరెంట్ రూల్స్ పెట్టుకుంటారు. ఆ రూల్స్ ను చచ్చేంత వరకు పాటిస్తారు. ఆ రూల్స్ ని ఎవరు బ్రేక్ చేస్తే, వాళ్ళని చంపేస్తారు. అలాగే హీరో మైకేల్ తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. అయితే జేమ్స్ ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ అయినా తనలో ఉన్న మానవీయ కోణంతో మైకేల్ ను దగ్గర తీసుకొని రూల్స్ చెప్పడంతో జేమ్స్ దగ్గర సీక్రెట్ వెపన్ మైఖేల్ గా మారతాడు. అయితే అతనికి ప్రేమ,బాధ, కోపం,వంటి ఎమోషన్స్ ఉండవు. తనకు తెలిసింది ఒక్కటే. ఎవరికైనా ఇచ్చిన ప్రామిస్ కు ఎంత దూరమైనా వెళ్లడం, అలాగే తనకొచ్చిన డీల్ ను ఫినిష్ చేయడం కొన్ని రోజుల తరువాత ఒక బార్ కి వెళ్లిన చోట జెస్సిక పరిచయం అవుతుంది. అప్పటినుండి మైక్ ను జెస్సీ ఇష్టపడుతుంది. అలా వీరి ప్రేమ మరో హైలెట్ అంశం అవుతుంది.

జేమ్స్ నుండి డ్రగ్ డీలర్ విలియం ని, తన కూతురుని చంపాలని డీల్ వస్తుంది. విలియంను చంపిన తరువాత జెస్సీ విలియం కూతురని తెలుసుకుంటాడు. దాంతో మైక్ కు కూడా జెస్సీ పై ఇష్టాన్ని పెంచుకుంటాడు. ఒక ఆటాక్ జరిగిన తర్వాత రూల్స్ ని బ్రేక్ చేసిన డేవిడ్ కొడుకు జార్జ్ ను చంపేస్తాడు. తన కొడుకు చావుకు కారణమైన జేమ్స్ గ్యాంగ్ బతకకూడదని సిటీ లో ఉన్న గ్యాంగ్ స్టర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి జేమ్స్ గ్యాంగ్ ను ఎవరైతే ఫినిష్ చేస్తారో వారికి నా బిజినెస్ లో వాటా ఇస్తాను అని చెప్తాడు. మరోవైపు మైక్ విలియం డీల్, జార్జ్ డీల్ ఫినిష్ చేసుకొని వచ్చేలోపే జెస్సీ.. జేమ్స్ భార్యగా మారి ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్ లేని మైక్ జెస్సీని ను ఎందుకు ఇష్టపడ్డాడు..తను ఇష్టపడిన జెస్సీ.. జేమ్స్ భార్యగా ఎలా మారింది. జెస్సీ ని చంపాలని డీల్ కుదుర్చుకున్న మైక్ మొదటి సారి రూల్స్ ను బ్రేక్ చేసనందున ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు?. వార్ ప్రకటించిన డేవిడ్ గ్యాంగ్ తో ఫైట్ చేసే క్రమంలో మైక్ చనిపోయాడా..లేక ఈ వార్ ఫినిష్ చేసి పెంచి పెద్ద చేసిన జేమ్స్ నే ఎదిరించి జెస్సి ని దక్కించుకున్నాడా ? అనేది తెలుసుకోవాలి అంటే సినిమాను థియేటర్లలో చూడాలి..

నటీ నటుల యాక్టింగ్ విషయానికొస్తే.. మైఖేల్ పాత్రలో నటించిన చంద్రశేఖర్ రాథోడ్ మొదటి సినిమా అయినా హలీవుడ్ స్టైల్ లో మాటలు తక్కువ ఉన్న తన బాడీ లాంగ్వేజ్ తో, హావ భావాలతో చాలా చక్కగా నటించాడు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా డూప్ లేకుండా చాలా అద్భుతంగా నటించాడు. జెస్సిక పాత్రలో నటించిన హీరోయిన్ కాశ్వీ కాంఛన్ తన పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. మన తెలుగు అమ్మాయి కాకున్నా తెలుగుతనాన్ని ఉట్టిపడేలా తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. అభినవ్ జనక్, లు గ్యాంగ్ స్టర్స్ గా అద్భుతంగా నటించారు.డి. యస్. రావు, గిరి పోతురాజు, నవీన్ ఆర్యాన్ తదితరులందరూ వారికిచ్చిన పాత్రల పరిధి మేరకు చాలా చక్కగా నటించారని సినిమా టాక్ ను బట్టే అర్థం అవుతుంది.

ఇకపోతే.. రెండు గ్యాంగ్స్ మధ్య వార్ ను ఆకట్టుకునేలా డిజైన్ చేసి “ గ్యాంగ్ స్టర్ ” అనే కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతవరకు ఎన్నో గ్యాంగ్ వార్స్ పైన సినిమాలు చూసి ఉంటాము. కానీ ఈ సినిమా ఒక కొత్తగా ఉంది. మొదటి సినిమా అయినా డైరెక్టర్ చంద్రశేఖర్ రాథోడ్ రాసుకున్న కథ చాలా గ్రిప్పింగ్ ఉంది. హాలీవుడ్ స్టాండర్డ్ లో లైటింగ్సు ,సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఒక అనిమల్, కిల్ బిల్ సినిమాలలో ఎటువంటి ఫైట్స్ ఉంటాయో అలాంటి ఫైట్స్ ఈ సినిమాలో వున్నాయి. ఇందులో లవ్, యాక్షన్, సెటిల్డ్ ఎమోషన్ ఇలా అన్ని రకాల అంశాల ను తెరకెక్కించడంలో దర్శకుడుగా, నటుడుగా సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.టెక్నికల్‌ గా . ఫైట్స్, కొరియోగ్రఫీ, దర్శకత్వం..ఇవన్నీ ఒక్కరే చేయడం ఈజీ కాదు. మ్యూజిక్ బాగుంది. మొత్తానికి సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

ప్లస్ పాయింట్స్..

పెర్ఫార్మన్స్

సినిమాటోగ్రఫీ

డైరెక్షన్

ప్రొడక్షన్ వ్యాలూస్

మైనస్ పాయింట్స్.. 

ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉండడం

ఓవరాల్‌గా చెప్పాలంటే యాక్షన్ ,ఎమోషన్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం “గ్యాంగ్ స్టర్ “ సినిమా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు.

రేటింగ్.. 2.5/5

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×