Janwada Farm House Rave Party: జన్వాడ రేవ్ పార్టీతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయా? బీఆర్ఎస్ ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యిందా? ఒరిజినల్ ఫుటేజ్ డిలీట్ చేశారా? దీంతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? నేషనల్ మీడియా సైతం రేవ్ పార్టీ అంటుంటే కాదు ఫ్యామిలీ పార్టీ అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
జన్వాడ రేవ్ పార్టీ అనేక అంశాలను తెరపైకి తెచ్చింది. దీన్ని నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఫలితం లేకపోతోంది. తెలంగాణతోపాటు నేషనల్ మీడియా సైతం ముమ్మాటికీ రేవ్ పార్టీ డిబేట్ల మీద డిబేట్లు పెట్టేశాయి. డ్రగ్స్ దొరక్కుండానే కేసులా అంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫామ్ హౌస్ ఘటన పక్కా స్కెచ్ మరో నేత హరీష్‌రావు వండి వార్చే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు కూడా.
అసలు విషయానికి వచ్చేద్దాం.. ఫామ్ హౌస్ అంటే చుట్టూ కెమెరాలుంటాయి. కానీ శనివారం రాత్రి జరిగిన పార్టీ గురించి బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టే ఫ్యామిలీ పార్టీయే అనుకుందాం. మరి ఫుటేజ్ ఎందుకు డిలీట్ అయ్యింది? ఫ్యామిలీ పార్టీ అయితే విదేశీ మద్యం ఎందుకున్నట్లు?
డ్రగ్స్ టెస్టులో విజయ్ మద్దూరికి పాజిటివ్ ఎలా వచ్చింది? గేమింగ్ కాయిన్స్, క్యాసినో మెటీరియల్ గుర్తింపు ఎవరు తెచ్చారు? గతంలో అక్కడ ఏమైనా పార్టీలు జరిగాయా? ఈ వ్యవహారం జఠిలం కాకపోతే.. డీజీపీకి ఫోన్ చేసి కేసీఆర్ ఎందుకు ఆరా తీసినట్టు? ఎటుచూసినా అందరూ రేవ్ పార్టీయేనని అంటున్నారు. చివరకు నేషనల్ మీడియా సైతం రేవ్ పార్టీ అని హెడ్ లైన్ పెట్టేయడం, దానిపై గంటల కొద్దీ డిబేట్లు చేపట్టాయి.
ALSO READ: డీజీపీ కి ఫోన్ చేయడానికి సిగ్గులేదా కేసీఆర్.. బీజేపీ నేత ఆగ్రహం
రాజేంద్రప్రసాద్ పాకాల అలియాస్ రాజ్ పాపాల. ఆయన గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. రాజ్ పాకాలకు అత్యంత సన్నిహితుడు విజయ్. ఆయనకు చెందిన పలు కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు విజయ్ మద్దూరి. నార్మల్‌గా అయితే విజయ్ అమెరికా సిటిజన్. ఈ మధ్యన ఆయన విదేశాల నుంచి వచ్చారు. ఇండియాలో తాను ఎలాంటి డ్రగ్స్ వాడలేదన్నది విజయ్ వెర్షన్. రేవ్ పార్టీ అలియాస్ ఫ్యామిలీ పార్టీ వ్యవహారం నుంచి కారు పార్టీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.
#BreakingNews | Cyberabad Police crackdown on farmhouse liquor party allegedly belonging to KTR's relative, one arrested for testing positive for cocaine@swastikadas95 shares more details#KTRamaRao #KTR #Telangana #RaveParty #Drugs | @JamwalNews18 pic.twitter.com/8fQLWK5IYs
— News18 (@CNNnews18) October 27, 2024