BigTV English

OTT Movie : పోలీసులకు దిమ్మతిరిగేలా పోలీసే దొంగతనాలు చేస్తే… ఈ క్రైం ఇన్వెస్టిగేటివ్ మూవీ చూస్తే మైండ్ బ్లాక్

OTT Movie : పోలీసులకు దిమ్మతిరిగేలా పోలీసే దొంగతనాలు చేస్తే… ఈ క్రైం ఇన్వెస్టిగేటివ్ మూవీ చూస్తే మైండ్ బ్లాక్

OTT Movie : మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. దృశ్యం సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమాలకు ఫాలోయింగ్ పెరిగింది. మంచి కథలను తీసుకొని స్క్రీన్ మీద చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మలయాళీ దర్శకులు. దృశ్యం తరహాలోనే ఒక మూవీ ఓటిటిలో హల్చల్ చేస్తోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “కూమన్” (Kooman).  కానిస్టేబుల్ అయినటువంటి గిరిని అవమానించిన వాళ్ళకు అతడు ఏ విధంగా బుద్ధి చెప్తాడో ఈ మూవీలో చూడవచ్చు. ఈ మూవీలో ట్విస్టులు చాలానే ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం మిస్ కాకుండా చూడండి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

గిరి ఒక ఊరిలో పోలీస్ కానిస్టేబుల్ గా ఉంటూ, తన విధులను చాలా తెలివితేటలు ఉపయోగించి నిర్వహిస్తూ ఉంటాడు. పై ఆఫీసర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే ఆ ఊరిలో కొంతమంది గిరిని హేళన చేసి మాట్లాడుతుంటారు. వాళ్లకు తనదైన స్టైల్ లో బుద్ధి చెప్తుంటాడు. ఈ క్రమంలో ఆ స్టేషన్లో ఉండే ఇన్స్పెక్టర్ రిటైర్డ్ అవుతాడు. స్టేషన్ కి కొత్త ఇన్స్పెక్టర్ వస్తాడు. గిరిని ఆ ఇన్స్పెక్టర్ దూరం పెట్టి మిగతా కానిస్టేబుల్ తో ఎక్కువగా మాట్లాడుతుంటాడు. ఒకరోజు ఊరు అందరి మధ్య ఆ ఇన్స్పెక్టర్ గిరిని అవమానిస్తాడు. అది తట్టుకోలేని గిరి ఇన్స్పెక్టర్ కి బుద్ధి చెప్పాలనుకుంటాడు. ఒకరోజు బార్లో మద్యం సేవిస్తుండగా, అక్కడ ఒక దొంగ పరిచయం అవుతాడు. ఒకప్పుడు ఆ దొంగ ఒక ఇన్స్పెక్టర్ కి చుక్కలు చూపించి ఉంటాడు. ఇన్స్పెక్టర్ ఉన్న ఏరియాలో దొంగతనాలు చేసి, అప్పటి ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ అయ్యేలా చేస్తాడు ఆ దొంగ. ఈ విషయం తెలుసుకున్న గిరి, ఆ దొంగ తరహాలోనే దొంగతనాలు చేసి ఇన్స్పెక్టర్ కి బుద్ధి చెప్పాలనుకుంటాడు.

ఈ క్రమంలోని గిరి దొంగతనాలు చేస్తూ, ఆ డబ్బును పేదవాళ్ల ఇళ్లల్లో పడేస్తూ ఉంటాడు. దొంగతనాల కేసులు ఎక్కువగా వస్తూ ఉండటంతో, పై ఆఫీసర్లు ఇన్స్పెక్టర్ కి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. అప్పుడు ఎవర్నో ఒకరిని ఈ కేసులో అరెస్ట్ చేసి, మళ్లీ వదిలేద్దామని గిరితో ఇన్స్పెక్టర్ అంటాడు.  అప్పుడు గిరి బార్ లో పరిచయమైన దొంగతో మాట్లాడి, ఈ కేసులో నువ్వు అరెస్ట్ అయితే వెంటనే విడుదల చేస్తామన అంటాడు. అరెస్ట్ అవ్వడానికి  ఆ దొంగ ఒప్పుకుంటాడు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత దొంగ మీద అక్కడ వున్న అన్ని కేసులు పెట్టాలని ఇన్స్పెక్టర్ అనుకుంటాడు. ఈ విషయం తెలిసిన గిరి దొంగకి డూప్లికేట్ కి ఇచ్చి పారిపొమ్మంటాడు. దొంగ పారిపోవటంతో ఇన్స్పెక్టర్ ని పై ఆఫీసర్లు సస్పెండ్ చేస్తారు. ఈ విషయం తెలిసిన ఇన్స్పెక్టర్ గిరిని ఏం చేస్తాడు? ఆ ఊరిలోని కొంతమంది ఇతనిపై పగ ఎలా తీర్చుకుంటారు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

Our Fault Trailer : అమెజాన్ లో అరాచకం సృష్టించిన అడ*ల్ట్ మూవీ పార్ట్ 3 రెడీ… ట్రైలర్ లోనే అంతా చూపించారే

OTT Movie : అర్ధరాత్రి తల్లీపిల్లల్ని టార్గెట్ చేసే సైకో… ఆమె ఇచ్చే ఝలక్ నెవర్ బిఫోర్… మైండ్ బెండింగ్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : 20 ఏళ్ల యువతితో 40 ఏళ్ల వ్యక్తి పాడు పనులు… భార్యేమీ తక్కువ తినలేదు… భార్యాభర్తలు కలిసి చూడాల్సిన మూవీ

OTT Movie : తెగిపడే అమ్మాయిల తలలు…. అత్యంత దారుణంగా నరికి చంపే సీరియల్ కిల్లర్… ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్

Conjuring Movies: కంజ్యూరింగ్ మూవీస్ ఈ ఆర్డర్‌లో చూస్తేనే మజా.. ఈ లిస్ట్ ఫాలో అయిపోండి, ఓటీటీలో ఉన్నాయ్!

OTT Movie : డిన్నర్ కోసం వెళ్లి దిక్కుమాలిన ట్రాప్‌లో… ఈ క్రేజీ మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉందంటే?

Big Stories

×