BigTV English

Balineni Srinivasa Reddy: బాలినేనికి ఎమ్మెల్సీ? డిసైడ్ చేసిన పవన్? త్వరలో ఒంగోలులో బహిరంగ సభ?

Balineni Srinivasa Reddy: బాలినేనికి ఎమ్మెల్సీ? డిసైడ్ చేసిన పవన్? త్వరలో ఒంగోలులో బహిరంగ సభ?

Balineni Srinivasa Reddy: ఏపీ పాలిటిక్స్ లో ఆ నేతను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయన వార్తల్లో నిలిచారంటే.. ఆ హంగామా అంతా ఇంతా కాదు. ఉన్నట్లుండి ఆ నేత పేరు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. మొన్న కాంగ్రెస్, నిన్న వైసీపీ, నేడు జనసేన పార్టీ కండువా కప్పుకున్న ఆ నేతకు ఎమ్మెల్సీ పదవి ఖరారైందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నేనెక్కడున్నా రాజా.. రాజానే అనే రీతిలో ఉంది ఆ నేత పాలిటిక్స్ తంత్రం. ఇంతలా చెప్పాక ఆ నేత ఎవరో చెప్పాల్సిన అవసరం లేదుగా.. ఆయనేనండి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.


ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయానా మాజీ సీఎం జగన్ కు సమీప బంధువు కూడా. ఏపీలో మారిన రాజకీయ పరిణామాల మధ్య బాలినేని ఇటీవల జనసేన పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన బాలినేనికి, ఆదిలో కొంత అవరోధాలు స్వాగతం పలికాయి. కారణం ఒంగోలుకు చెందిన టీడీపీ నేతలు, జనసేనలో బాలినేని చేరికకు అడ్డు చెప్పడమే. అయినా తన పని తాను చేసుకుపోయినట్లు బాలినేని పార్టీలో చేరే ఘట్టం కూడా పూర్తయింది.

అయితే కాంగ్రెస్, వైసీపీ లలో ఉన్న సమయంలో బాలినేని, మంత్రి పదవులను కూడా దక్కించుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బాలినేని, జనసేనలో చేరగా ఒంగోలు టీడీపీ నేతలకు మింగుడు పడలేదనే చెప్పవచ్చు. కారణం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బాలినేని, తమను వేధించారన్నది స్థానిక టీడీపీ నాయకుల వాదన.


ఇప్పుడు జనసేనలో చేరి సైలెంట్ గా, నియోజకవర్గానికి దూరమై హైదరాబాద్ లో ఉంటున్నారు బాలినేని. కానీ ఆయన ఏమీ ఆశించకుండా ఉండే రకం కాదన్నది పొలిటికల్ టాక్. అందుకే జనసేనలో చేరిన బాలినేనికి, పవన్ ఎమ్మెల్సీ గా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారట. ఆ హామీని త్వరలోనే నిలబెట్టుకొనేలా పవన్ చక్రం తిప్పుతున్నారట. త్వరలో ఎమ్మెల్యేల కోటా కింద భర్తీ చేసే ఎమ్మెల్సీ పదవులలో జనసేనకు ఒకటి, కూటమి కేటాయించనుంది. ఆ ఒక్క ఎమ్మెల్సీ పదవి బాలినేనికి ఖరారైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

Also Read: Group 3 Exams: నిండు గర్భిణీ.. 5 రోజుల్లో కాన్పు.. ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. అసలు ఏం జరిగిందంటే?

అదే జరిగితే ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని తన హవా కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలు ఉండగా, బాలినేని ఎమ్మెల్సీ పదవిని స్వీకరిస్తే అక్కడ ఒక్క ఒరలో ఏ మేరకు రెండు కత్తులు ఇమడుతాయో వేచి చూడాలి. కాగా ఎమ్మెల్సీ పదవి దక్కిన వెంటనే పవన్ తో ఒంగోలు లో భారీ బహిరంగ సభను కూడా బాలినేని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం ప్రకాశంలో జోరందుకుంది.

ఏదిఏమైనా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి దక్కితే మాత్రం, ప్రకాశంలో జనసేనకు మరింత బలం చేకూరి క్యాడర్ బలోపేతం అవుతుందని బాలినేని అభిమానులు తెలుపుతున్నారు. మరి ఇంతకు బాలినేని కి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా అన్నది త్వరలోనే బహిర్గతమయ్యే రాజకీయ స్థితిగతులు ఉన్నట్లు పొలిటికల్ టాక్.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×