E-Paper
Advertisement

OTT Movie : ఆ సీన్స్ వల్ల భారత్ లో బ్యాన్… ఈ సినిమాలను ఎక్కడ చూడొచ్చో తెలుసా?

OTT Movie : ఆ సీన్స్ వల్ల భారత్ లో బ్యాన్… ఈ సినిమాలను ఎక్కడ చూడొచ్చో తెలుసా?
Advertisement

OTT Movie : వివాదాస్పద అంశాలు ఉండే సినిమాలు బ్యాన్ అవుతాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కొన్ని దేశాలలో వాళ్ల రూల్స్ కి వ్యతిరేకంగా రూపొందిన సినిమాలను భాషతో సంబంధం లేకుండా నిషేధం విధిస్తారు. అలా మన సినిమాలు కూడా విదేశాల్లో బ్యాన్ అయ్యాయి. అయితే చాలావరకు హాలీవుడ్ సినిమాల్లో బో*ల్డ్ కంటెంట్ తో సహా వైలెన్స్ ను కూడా అభ్యంతరాలు లేకుండా తెరపై చూపిస్తారు. కానీ అక్కడ రిలీజ్ అయ్యే ప్రతి సినిమా మన దేశంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలా కొన్ని కారణాలతో ఇప్పటికే ఇండియాలో బ్యాన్ అయిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్

Advertisement

ఈ సినిమాలో భారతీయ నాగరికత సంస్కృతిని తప్పుగా చూపించడంతో మన దగ్గర ఈ మూవీపై బ్యాన్ విధించారు. ఇండియాలో బ్యాన్ అయిన ‘ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్’  సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రిమింగ్ అవుతోంది.

బ్లూ జాస్మిన్

Advertisement

ఈ సినిమాలో ధూమపానాన్ని విపరీతంగా ప్రచారం చేయడంతో భారతదేశంలో బ్యాన్ కు గురైంది.. అయితే యూట్యూబ్లో మాత్రం ఈ మూవీని ఫ్రీగా చూసే ఛాన్స్ ఉంది.

ది డావెన్సీ కోడ్

ఈ సినిమాలో ఒక మతాన్ని తప్పుగా చూపించారనే ఆరోపణల కారణంగా భారతదేశంలోనే కాకుండా  మరికొన్ని దేశాల్లో కూడా బ్యాన్ చేశారు. కానీ ‘ది డావెన్సీ కోడ్’ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

50 షేడ్స్ ఆఫ్ గ్రే 

ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఏకంగా న్యూ*డ్ గా కనిపించిన సన్నివేశాలున్నాయి. మితిమీరిన బో*ల్డ్ సీన్స్ కారణంగా భారతదేశంలో బ్యానైన ’50 షేడ్స్ ఆఫ్ గ్రే’ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ

ఈ సినిమాలో లైంగిక వేధింపులు, హింసను ప్రోత్సహించారనే వివాదం ఉంది. అంతేకాకుండా సినిమాలోని చాలా సన్నివేశాలు బీభత్సమైన హింసతో ఉండడంతో ఇండియాలో ‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ మూవీ బ్యాన్ అయింది. కానీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఐ స్ప్లిట్ ఆన్ యువర్ గ్రేవ్

ఈ సినిమాలో ఒక అమ్మాయి వింత కథ ఉంటుంది. సినిమాలోని కొన్ని అభ్యంతర సన్నివేశాల కారణంగా భారత్ లో ఈ సినిమాపై బ్యాన్ విధించారు. ఈ మూవీ కూడా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ది హ్యూమన్ సెంటిఫైడ్

ఇందులో ఒక సైకో సైంటిస్ట్ కథను చూడొచ్చు. సినిమాలో ఎక్కువగా హింసాత్మక అశ్లీల సీన్స్ ఉండడంతో ఈ మూవీని బ్యాన్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

మ్యూజిక్ మైక్ ఎక్స్ఎక్స్ఎల్

ఈ సినిమాలో ఎక్కువగా అశ్లీల సన్నివేశాలు ఉండడంతో ఇండియాలో బ్యాన్ కు గురైంది. కానీ జియో సినిమాలో ఈ మూవీని చూడొచ్చు.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×