BigTV English

Zebra Twitter Review : “జీబ్రా” ట్విట్టర్ రివ్యూ.. సత్యదేవ్ ఈ సారైన హిట్ కొట్టాడా?

Zebra Twitter Review : “జీబ్రా” ట్విట్టర్ రివ్యూ.. సత్యదేవ్ ఈ సారైన హిట్ కొట్టాడా?

Zebra Twitter Review : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరు సత్య దేవ్.. మొదటి నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు.. అయితే ఈయనకు ఇప్పటివరకు సరైన హిట్ సినిమా పడలేదు. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని సరికొత్త కథ ప్రేక్షకుల ముందుకు ‘జీబ్రా ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఇవాళ థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే, ముందు రోజు పెయిడ్ ప్రీమియర్లు వేశారు. మరి, సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? ట్విట్టర్ టాక్ ఎలా ఉంది? అనేది చూద్దాం..


సత్య దేవ్ ‘జీబ్రా’ పెయిడ్ ప్రీమియర్స్ జనాలు అందరూ బావుందని చెబుతున్నారు. అసలు ఊహించలేదని, సినిమా ఇంత మంచిగా ఉంటుందని అనుకోలేదని అంటున్నారు. బ్యాంకు మోసాల మీద తీసిన ఈ సినిమా ఇంత ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నెటిజన్స్ చెబుతున్నారు. థియేటర్లలో సినిమాను అస్సలు మిస్ కావద్దని అన్నారు. మరి, సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉందో ఓ లుక్ వేసుకోండి..

సత్య దేవ్ నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఇక హాస్యనటుడు సత్య తన టైమింగ్‌కు ఎవరూ సరిపోరనే టాక్ ను కైవసం చేసుకున్నాడు. ప్రధానంగా పాముతో సన్నివేశాలు అదిరిపోయాయి. సత్య దేవ్, సత్య మధ్య సాగిన కామెడీ హిలరియస్ గా ఉందనే టాక్ ను అందుకుంది..

‘తిమ్మరుసు’ తర్వాత సత్యదేవ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ‘జీబ్రా’తో ఆయన కమ్ బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఎగ్జైటింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ వైట్ కాలర్ క్రిమినల్ డ్రామా అని పేర్కొన్నారు. సత్యదేవ్, ధనుంజయ ఇరగదీశారని… వాళ్లిద్దరూ తమ నటనతో ఆడియన్స్ మనసు దోచుకోవడం గ్యారంటీ అని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. కమెడియన్ సత్య, సత్యరాజ్, జెనీ మేజిక్ చేశారని తెలిపారు. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ చాలా తెలివిగా స్క్రిప్ట్, సీన్స్ రాశారట. రవి బస్రూర్ రీ రికార్డింగ్ కుమ్మేశారట. ఎడిటింగ్ గురించి కూడా నెటిజనులు చెబుతున్నారు.

థ్రిల్లింగ్ అసాధారణ కామెడితో జిబ్రా ఉంది. అద్భుతమైన కథ మరియు కొన్ని సరదా క్షణాలతో గట్టి స్క్రీన్‌ప్లేతో ఆకర్షణీయమైన వైట్ కాలర్ క్రైమ్ డ్రామా! ఇక ప్రతి పాత్రకు ప్రాదాన్యత ఉంటుంది, ఇక్కడ సత్యదేవ్ & ధనంజయ ఈ థ్రిల్లింగ్ షోను దొంగిలించారు సత్య.. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని నెటిజన్ కామెంట్ చేశారు.

మొత్తానికి ఈ మూవీ పై నెటిజన్లు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. మంచి టాక్ అయితే అందుకుంది ఇక సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

 

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×