BigTV English

OTT Movie : గెస్ట్ హౌస్ లో ఈ అమ్మాయి చేసే రచ్చ అంతా ఇంతా కాదు… పిచ్చెక్కించే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : గెస్ట్ హౌస్ లో ఈ అమ్మాయి చేసే రచ్చ అంతా ఇంతా కాదు… పిచ్చెక్కించే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్న మలయాళం సినిమాలకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఈ సినిమాలు స్లోగా రన్ అవుతున్నప్పటికీ, కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు మలయాళం సినిమాలను ఆదరిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా మలయాళం నుంచే వస్తున్నాయి. ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక మలయాళీ మూవీ గురించి తెలుసుకుందాం


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నో మ్యాన్స్ ల్యాండ్‘ (No Mans Land). ఈ మూవీకి జిష్ణు హరీంద్ర వర్మ దర్శకత్వం వహించారు. 2021 రిలీజ్ అయిన ఈ మలయాళ  థ్రిల్లర్ మూవీలో లుక్మాన్ అవరన్, శ్రీజా దాస్, సుధీ కొప్పా ప్రధాన పాత్రల్లో నటించారు. జిష్ణు హరీంద్ర వర్మ మొదటిసారి దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా ఇది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

సుమిత్ర ఒక రిసార్ట్ లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి పోయే కష్టమర్లకి తన అందాన్ని ఎరగా వేస్తూ, డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంది. అక్కడే కుట్టి అని మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తి కూడా ఉంటాడు. ఆ రిసార్ట్ మేనేజర్ కి తెలిసే ఇదంతా  జరుగుతూ ఉంటుంది. సుమిత్రాకు ఒక అబ్బాయి ఉంటాడు. సుమిత్ర తల్లి దగ్గర తన కుమారున్ని చదివిస్తూ ఉంటుంది. అయితే ఆమె డబ్బులు ఎక్కువగా అడుగుతూ ఉంటుంది. ఇవ్వకపోతే పిల్లవాడిని అనాధ శరణాలయంలో చేర్పిస్తానని బెదిరిస్తూ ఉంటుంది. అందుకు సుమిత్ర,కుట్టికి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్న క్రమంలో ఈ రిసార్ట్ కి ఒక జంట వస్తుంది. ఆ జంటను చూసి సుమిత్రకు ఈర్ష కలుగుతుంది. ఎందుకంటే సుమిత్ర లైఫ్ బాగా లేనందుకు మనసులో ఆ ఫీలింగ్ వస్తుంది. వీళ్లను సీక్రెట్ గా చూస్తూ ఉంటుంది సుమిత్ర. సీక్రెట్ గా చూస్తున్న  విషయం తెలిసిన ఆ జంట సుమిత్రను  నిలదీస్తారు.

మద్యం మత్తులో ఉన్న సుమిత్ర వారిపై దాడి చేస్తుంది. ఆ దాడిలో ప్రేమికుడు చనిపోతాడు ప్రియురాలు తప్పించుకొని పారిపోతుండగా, కుట్టిని పంపించి ఆమెను తీసుకు రమ్మని చెప్తుంది. కుట్టి మద్యం తాగి ఉంటాడు. పైగా అతనికి డ్రగ్ కూడా ఇచ్చి ఉంటుంది సుమిత్ర. ఆ మైకంలో ఆమెను తీసుకువచ్చి, సుమిత్ర చెప్పడంతో చంపేస్తాడు. ఆ తర్వాత మానేజర్ కి వాళ్లు చెప్పకుండా వెళ్ళిపోయారని తప్పుడు సమాధానం చెబుతుంది. అక్కడికి ఆ జంటను వెతుక్కుంటూ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ని కూడా తన అందాలతో రెచ్చగొడుతుంది సుమిత్ర. చివరికి పోలీస్ ఆఫీసర్ ఆమె అందాలకు లొంగిపోతాడా? ఆ హత్య కేసును వెలికి తీస్తాడా? సుమిత్ర నేరం ఒప్పుకుంటుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్  అవుతున్న ఈ రొమాంటిక్ సస్పెన్స్ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×