Chiranjeevi : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. స్వయం కృషితో పైకొచ్చిన హీరో.. అందుకే ఇండస్ట్రీలోని జనం అంతా మెగాస్టార్ అంటున్నారు.. ఈ వయస్సులో కూడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. అందులో ఒకటి విశ్వంభర.. షూటింగ్ దశలో బిజీగా ఉంది. అలాగే ఈయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే చిరు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈయన గతంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. సీఏం అవ్వాలనే కోరికతో కొత్త పార్టీని స్థాపించాడు.. కానీ మంత్రిగా కొన్ని రోజులు కొనసాగారు. అసలు చిరంజీవికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన రావడానికి ఓ సినిమా కారణం అని తెలుస్తుంది.. ఆ మూవీ చెయ్యడం వల్లే సినిమా చెయ్యాలనే కోరిక కలిగిందట.. చిరును అంతగా మోటివేషన్ చేసిన సినిమా ఏదో తెలుసుకుందాం..
సినిమాల్లోకి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి ముళ్ల బాటలో నడిచి తనను నమ్ముకున్న ఎంతోమందికి పూలబాట వేశారు. నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో అదే ఫామ్ లో దూసుకుపోతున్నారు చిరు.. అయితే చిరు సినిమాలలో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న సమయంలో చిరంజీవి తన అభిమానుల కోరిక మేరకు 2008లో ప్రజా రాజ్యం అనే పార్టీని సొంతంగా స్థాపించారు.. ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. కానీ ఫలితం దక్కలేదని తెలిసిందే. కొన్నాళ్లకు సినిమాలకు దూరం అయ్యారు. కూడా.. ఆ తరువాత ఆరు నెలలకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలను ప్రజారాజ్యం కైవసం చేసుకుంది. అయితే ముఖ్యమంత్రి కావాలనే కోరికతోనే చిరంజీవి పార్టీ పెట్టారని సమాచారం..
మెగాస్టార్ కు రాజకీయాల్లోకి రావాలనే కోరిక కలిగేలా చేసింది తన సినిమానే కారణం అట.. ఆ సినిమా చేసిన తర్వాత అలాంటి కోరిక పుట్టిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరునే స్వయంగా చెప్పారు. సినిమానే కారణమని సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ముఠామేస్త్రి సినిమాలో మార్కెట్లో కూలీగా పని చేస్తూ.. ఏకంగా చిరంజీవి మంత్రి స్థాయికి ఎదుగుతాడు. ముఠామేస్త్రి సినిమా ప్రభావం వల్లే చిరుకి ముఖ్యమంత్రి అవ్వాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత అనుకున్నట్లుగానే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్ళీ సినిమాలే ముద్దు అని సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో ఆచార్య మూవీ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు భారీ అంచనాల తో విశ్వంభరా మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ త్వరలోనే రాబోతుంది. ఈ మూవీ పై చిరు ఆశలు పెట్టుకున్నాడు. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..