OTT Movie : సస్పెన్స్ సినిమాలు చూసేకొద్దీ చూడాలనిపిస్తూ ఉంటాయి. సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇటువంటి సినిమాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే కొన్ని ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటాయి. మరికొన్ని ఒంటరిగా మాత్రమే చూడగలుగుతాం. ఫ్యామిలీతో చూడగలిగే ఒక హాలీవుడ్ సస్పెన్స్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరు ఏమిటో? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో…
ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ రొమాంటిక్ సస్పెన్స్ మూవీ పేరు “అన్ డైన్” (ondine) ఈ మూవీలో హీరో చేపలు పట్టడానికి పోతే అతనికి ఒక అమ్మాయి వలలో చిక్కుతుంది. ఈ అమ్మాయి జలకన్య అనుకొని హీరో తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. వీరిద్దరి మధ్య మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే…
హీరో చేపలు పడుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇతనికి పెళ్లితోపాటు విడాకులు కూడా అయిపోయి ఉంటాయి. ఒక కూతురు ఉండటంతో ఆమెను అప్పుడప్పుడు చూసుకునే వెసులుబాటును కోర్టు కల్పిస్తుంది. అలా సాగుతున్న క్రమంలో హీరో చేపల వేటకి వెళతాడు. ఎంత వెతికినా ఒక చేప కూడా వలలో పడకుండా ఉంటుంది. ఒకచోట వల విసరగా ఒక బరువు ఉన్న చేప పడిందేమో అని హీరో వలని పైకి లాగుతాడు. తీరా చూస్తే అందులో ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె కొనఊపిరితో ఉండగా హీరో కాపాడుతాడు. ఆ ప్రాంతంలో నీళ్లలో ఒంటరిగా ఒక అమ్మాయి దొరకడంతో, ఆమెను హీరో జలకన్య అనుకుంటాడు. ఆమె తనకు ఎవరూ లేరని చెప్పడంతో తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తాడు. ఒకరోజు కూతుర్ని చూడటానికి హీరో మాజీ భార్య ఇంటికి వెళ్తాడు. కూతురితో కాసేపు గడిపి జలకన్య కథ ఒకటి చెబుతూ ఉంటాడు. అతడు చెప్పే విధానం చూసి తన తండ్రికి నిజంగా జలకన్య తెలుసనుకుంటుంది ఆ అమ్మాయి.
ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కిడ్నీ సమస్య వల్ల వీల్ చైర్ లోనే ఉంటుంది. హీరో ఇంటికి వచ్చిన కూతురు హీరోయిన్ ని కలసి నువ్వు జలకన్యవని నాకు తెలుసు అంటూ మాట్లాడుతుంది. నాకున్న జబ్బును మాయం చేయమని అడుగుతుంది. హీరోయిన్ ఆమెను ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతుంది. ఒకరోజు హీరో హీరోయిన్తో కలిసి చేపలు పట్టడానికి వెళ్తాడు. ఆరోజు మాత్రం ఖరీదైన చేపలు అతని వలలో చిక్కుతాయి. ఆ తర్వాత హీరోయిన్ కోసం ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతనికి దొరక్కుండా హీరోయిన్ తప్పించుకుంటుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్, హీరోతో ఏకాంతంగా గడుపుతుంది. హీరోతో హీరోయిన్ తనెవరు, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తుంది. ఆ విషయాలు విన్న హీరో షాక్ కి గురవుతాడు. ఇంతకీ వలలో చిక్కిన అమ్మాయి ఎవరు? ఆమె నిజంగానే జలకన్య నా? హీరోయిన్ ఎవరో తెలిసి హీరో ఎందుకు షాక్ అవుతాడు? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ సస్పెన్స్ మూవీని తప్పకుండా చూడండి.