Satyabhama Today Episode December 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. గంగను ఇంట్లో నుంచి పంపించాలని ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. భైరవి ఆ గంగాకి ఎంతో కొంత ఇచ్చేసి పంపించేయ్ నాకు టెన్షన్ అవుతుందని మహాదేవయ్యను అడుగుతుంది. ఆస్తిస్తే పోతుందా అనేసి సత్య అడుగుతుంది. ఇదంతా కాదు టెస్ట్ చేయిస్తే సరిపోతుంది అని సత్య అందరిని నమ్మిస్తుంది. ఇక అప్పుడే గంగా ఎంట్రీ ఇస్తుంది. నేను పోను అంటూ డైలాగ్ తో అందరికీ షాక్ ఇస్తుంది. ఆయనకి నేను రెండో భార్యని అంటే నాకు కూడా ఇంట్లో హక్కుంది అక్కకి ఎంత హక్కుందో నాకు అంతే అక్కుంది అనేసి నాకు ఇంట్లో సగం పాట కావాలి అని అడుగుతుంది గంగ. లేదంటే డిఎన్ఎ టెస్ట్ చేయించుకుని అసలు నిజమేంటో బయటపడాలి అనేసి డిమాండ్ చేస్తుంది.. నువ్వు క్రిష్ నాతోటి వచ్చేసేయండి మన ఇంట్లో ఉందామనేసి అడుగుతుంది గంగ . దానికి క్రిష్ సచ్చినా నేను పోను అని అంటాడు. మరి రేపు డిఎన్ఎ టెస్ట్ చేయించుకోవడానికి నేను రెడీ ఆ టెస్ట్ లో నేను కాదని తెలిస్తే ప్రాణత్యాగం కూడా చేస్తానని గంగా సవాల్ చేసి వెళ్తుంది. ఇక భైరవి జయమ్మ టెన్షన్ పడుతుంటారు. మహదేవయ్య దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. మైత్రి విషయంలో నందినికి అన్యాయం చెయ్యొద్దని తన పేరెంట్స్ చెప్పడంతో హర్ష మైత్రిని దూరం పెడతాడు. సంధ్యను ఎలాగైనా బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. డీఎన్ఏ టెస్ట్ శాంపిల్స్ కోసం డాక్టర్స్ వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. గంగ మహాదేవయ్య గుట్టు బయట పెట్టేవరకు నిద్ర పోను అని సత్యకు భరోసా ఇస్తుంది. అలానే మహాదేవయ్య రెండో పెళ్ళాం అన్నట్లు అందరిని నమ్మిస్తుంది. మహదేవయ్య ఇంటికి డాక్టర్స్ వస్తారు. అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు. డాక్టర్స్ ఏంటి మీరు డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధంగా లేరా అనేసి అడుగుతారు. మీరు మనసు మార్చుకున్నారా అయితే చెప్పండి అనేసి అడుగుతారు. మహదేవయ్య నన్ను కాదు అడగాల్సింది ఆ విషయం ఆవిడని అడగండి అనేసి అంటారు. ఇంత దూరం వచ్చిన తర్వాత తగ్గేదే లేదు అనేసి గంగ అంటుంది. ఇక సత్యా మరో డ్రామా ని మొదలు పెడుతుంది. పరువు తీసింది చాలు ఇక్కడి తో ఆపేద్దామనేసి అంటుంది. మహదేవయ్యకు చెమటలు పట్టిస్తుంది. నన్ను ఇరికించాలి కంకణం కట్టుకుంది. కానీ ఇపుడేమో ఇలా నీతులు వళ్లిస్తుంది అని మహాదేవయ్య ఆలోచిస్తాడు. దానికి గంగా మోసం చేసేది నేను కాదు మీ మామయ్యే అనేసి అంటుంది. ఆఖరి అవకాశము ఇవ్వాల్సింది నాకు కాదు మీ మామయ్యకే అని గంగా డిఎన్ఎ టెస్ట్ కి రెడీ అని చెప్తుంది. టెస్ట్ కి శాంపిల్స్ ఇస్తారు కానీ మహదేవయ్యా ఆలోచిస్తూ ఉంటాడు సత్య మహదేవయ్యకు ఇదే లాస్ట్ అవకాశం మీరు కన్న తండ్రి కాదని ఒప్పేసుకోండి లేదంటే మాత్రం అడ్డంగా ఇరుక్కుంటారు అనేసి అంటుంది. సత్య మార్చుకుంటున్నారా అని అడుగుతుంది దానికి గంగా నేను అస్సలు ఒప్పుకోను అనగానే భైరవి కూడా నేను ఒప్పుకోను శాంపిల్ ఇవ్వాల్సిందే అనేసి అంటారు. భైరవి నా పెనిమిటి అలాంటోడు కాదు నా పెనిమిటి వెనక్కి తగ్గడు శాంపిల్స్ తీసుకో అనేసి డాక్టర్ కి చెప్తుంది. అసలు వ్యవహారం ఏంటో ఇప్పటి తో బయటపడుతుందనేసి సత్య అంటుంది.
ఇక భైరవి కోసమైనా డీఎన్ ఏ టెస్ట్ చేయించుకోవాలని జయమ్మ అనగానే అందరి పోడు భరించలేక మహాదేవయ్య శాంపిల్స్ ఇస్తాడు. చూసాడుగా నా పెనిమిటి తప్పు చేసేటోడు కాదు అని భైరవి అంటుంది. రేపటితో ఎవరి జాతకం బయట పడుతుందో చూద్దాం అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక క్రిష్ గంగ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక గంగా రేపు ఏమి జరుగుతుంది అనేది వెయిట్ చెయ్యి అన్నట్లు చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక సత్య మహాదేవయ్య ఓటమి ఖాయం అసలు శాంపిల్స్ ఇవ్వకుండా ఉండి ఉంటే బాగుండు రేపటితో మీ పెద్ద మనిషి అనే ముసుగు తొలగిపోతుందని వార్నింగ్ ఇస్తుంది. పాతికెళ్ళు దాచి పెట్టిన నిజం తెలిసిపోతుంది అని అంటుంది. తర్వాత మహాదేవయ్య లాగా బంటి రెడీ అయ్యి ఉంటాడు. అది చూసి అందరు అక్కడికి పరుగున వస్తారు. క్రిష్ మా బాపు డ్రెస్సు వేసుకుంటావా అని నాలుగు పీకుతాడు. మధ్యలో సత్య వచ్చి అడ్డుకుంటుంది. తండ్రి కాదని తెలిస్తే మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మహాదేవయ్య టెన్షన్ పడతాడు. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..