Bigg Boss 8 Telugu : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. రోజు రోజుకు ట్విస్టులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ షో 15 వారాలు వరకు ఉంటుంది. ప్రస్తుతం 13 వ వారంలో ఉంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ భావించింది. ఫినాలే ఎపిసోడ్ కు 5 మంది ఉండాలంటే ఈ వారం వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం ఓటింగ్ కూడా రివర్స్ అయ్యింది. టాప్ లో ఉన్న గౌతమ్ రెండో ప్లేసులోకి వచ్చాడు. నిఖిల్ ఫస్ట్ ప్లేసులోకి వచ్చేసాడు.. ఒక తేజా, నబీల్, పృథ్వి ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. శనివారం ఎపిసోడ్ లో టేస్టీ తేజా తక్కువ ఓటింగ్ నమోదు చేసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. హౌస్ నుంచి బయటకు రాగానే హౌస్ మేట్స్ అసలు రంగును బయట పెట్టాడు. విన్నర్ ఎవరో కూడా చెప్పేశాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా హాట్ టాపిక్ అయ్యింది. అసలు తేజా హౌస్ మేట్స్ గురించి ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి వారం లాగే శనివారం ఎపిసోడ్ సరదాగా మొదలైంది.. అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామేన్స్ తో నాగార్జున ఎంతో ఎనర్జిటిక్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హౌస్ లో ఏం జరుగుతుంది అనేది మన టీవీ లో చూసాడు. అప్పటివరకు హౌస్‌మేట్స్ చెప్పిన అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటూ పోయిన నాగార్జున.. గౌతమ్‌కు మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అలాగే రోహిణి, నిఖిల్, అవినాష్‌కు సైతం గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అనంతరం దమ్ము-దుమ్ము అని ఓ గేమ్ ఆడించాడు. ఆ గేమ్ లో అందరు తేజాను టార్గెట్ చేశారు. ఇక అది అవ్వగానే తేజా ఎలిమినేట్ అయ్యాడు.. స్టేజ్ మీదకు రాగానే తేజా జర్నీని నాగార్జున చూపించాడు. ఆ తర్వాత గేమ్ ఆడించాడు. స్టేజ్ మీద కొన్ని కూర గాయాలను పెట్టి ఎవరికి ఏ వేజీటేబుల్ ఇస్తావు అని నాగ్ అడిగాడు.
ఇక గౌతమ్‌పై తన కోపాన్నంతా కక్కేశాడు. టికెట్ టు ఫినాలే ఆడే క్రమంలో ఓ గేమ్‌లో గౌతమ్ నా పేరు సెలక్ట్ చేయకపోవడంతో బాధేసిందని, అదే విషయం అతడిని నిలదీశానన్నాడు. నామినేషన్స్‌లో ప్రేరణతో అంత గొడవైనా కూడా ఆమెనే ఎందుకు సెలక్ట్ చేశాడు? అక్కడ నేను ఫ్రెండ్ నన్ను సెలక్ట్ చేస్తే అతడికి సోలో బాయ్ అనే ట్యాగ్ పోతుందని వెనకడుగు వేశాడు. ప్రేరణను సెలక్ట్ చేస్తే తనకు మంచి పేరొస్తుందని లెక్కలు వేసుకున్నాడని తెలిపాడు.. ఆ తర్వాత అవినాష్ కు ఉల్లిపాయ ట్యాగ్ ను ఇచ్చేసాడు. సీజన్‌లో పెద్ద గెలుపు రోహిణిదేనంటూ బంగాళాదుంపతో పోల్చాడు. విష్ణుప్రియ కాకరకాయ అన్నాడు. ప్రేరణ.. మాట సరిగా లేకపోతే నెక్స్ట్ నువ్వే బయటకు వచ్చేస్తావని హెచ్చరిస్తూ బెండకాయ ఇచ్చాడు. పృథ్వీ.. విష్ణుప్రియను వదిలినట్లు కొన్ని గేమ్స్ కూడా వదిలేస్తున్నావంటూ పచ్చిమిర్చి ట్యాగ్ ఇచ్చాడు. గౌతమ్‌లో ఎన్ని పొరలుంటాయో వాడికే తెలీదంటూ క్యాబేజీతో పోల్చాడు. అతడు టాప్ 2లో పక్కాగా ఉంటాడనన్నాడు. నబీల్.. గేమ్‌లో కన్ఫ్యూజ్ అవుతున్నాడని, టాప్ 2లో ఉంటాడనుకుంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చేశాడంటూ టమాటతో పోల్చాడు. నిఖిల్ ను సొరకాయ తో పోల్చాడు. విన్నర్ గౌతమ్ అని చెప్పేశాడు. ఇప్పటివరకు అందరు గౌతమ్ పేరు ఎక్కువగా చెప్పారు. మరి ఎవరు విన్నర్ అవుతారో మరో వారంలో తెలియనుంది..