BigTV English

OTT Movie : ఊరంతా జాంబిలే ఆ ఒక్క ఫ్యామిలీ తప్ప… గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడాల్సిన సినిమా

OTT Movie : ఊరంతా జాంబిలే ఆ ఒక్క ఫ్యామిలీ తప్ప… గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడాల్సిన సినిమా

OTT Movie :  సాధారణంగానే జాంబీ సినిమాలు అంటే చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇలాంటి సినిమాలకు హాలీవుడ్ పెట్టింది పేరు. తెలుగులోనూ ప్రశాంత్ వర్మ రూపొందించిన జాంబీ రెడ్డి మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కానీ ఇలాంటి జాంబీ సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ ఆకలితో ఉంటారు. అలాంటి వారి ఆకలిని తీర్చడానికి గతవారం ఓటీటీ లోకి వచ్చేసింది ఓ జాంబి మూవీ. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి..


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా ఫిలిప్పీన్స్ మూవీ కావడం విశేషం. ఇందులో అవార్డు విన్నింగ్ యాక్టర్ సీడ్ లూసేరో ప్రధాన పాత్రను పోషించగా, బ్యూటీ గొంజలెజె, ఐడెన్ టైలర్, మార్కో మాస కీలకపాత్రలు పోషించారు. కార్లో లేడెస్మా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడం ఖాయం. ఈ సినిమా పేరు “అవుట్ సైడ్” (outside). ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


కథలోకి వెళ్తే…

అన్ని జాంబీ సినిమాలలో లాగే ఈ సినిమాలో కూడా జాంబీ వైరస్ వల్ల దేశమంతా నాశనం అయిపోతుంది. కానీ ఫ్రాన్సిస్ తన భార్య ఇద్దరు పిల్లలు మాత్రం ఆ వైరస్ నుంచి తప్పించుకుంటారు. ఆ తర్వాత ఈ ఫ్యామిలీ తమ చిన్నతనంలోనే వదిలేసిన ఫామ్ హౌస్ లోకి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లేసరికి వాళ్ళ తల్లికి వైరస్ ఎఫెక్ట్ అవుతుంది. తండ్రి ఏమో సూసైడ్ చేసుకుంటాడు. ఫ్రాన్సిస్ తమ్ముడు వేరే ప్రాంతంలో ఉంటాడు. దీంతో ఫామ్ హౌస్ కి వెళ్ళిన ఫ్రాన్సిస్ ఫ్యామిలీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేమని అర్థం చేసుకుంటారు. చేసేదిలేక అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్దాం అనుకుని వేరే దారి లేక అక్కడే ఉండి పోవాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో కొన్ని రోజులు గడిచాక ఫ్రాన్సిస్ వింతగా ప్రవర్తిస్తాడు.

అతనికి తన తండ్రి ఆత్మ ఏదో చెప్పినట్టుగా ఫీలవుతాడు. భార్యపై కోపంతో ఊగిపోతూ సైకోలా ప్రవర్తిస్తాడు. ఈ నేపథ్యంలోనే జాంబీలు ఆ ఇంటిపై అటాక్ చేయడానికి వస్తాయి. మరి జాంబీలు చుట్టుముట్టినప్పుడు ఈ ఫ్యామిలీ ఏం చేసింది? ఫ్రాన్సిస్ తమ్ముడు చివరికి తిరిగి వచ్చాడా? అసలు ఈ ఫ్యామిలీలో ఒక్కరైనా జాంబిల నుంచి తప్పించుకుని బయటపడగలిగారా? అనే విషయాలు తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న అవుట్ సైడ్ సినిమాపై ఒక లుక్కెయ్యండి. అయితే సినిమాలో అక్కడక్కడ కొన్ని మసాలా సీన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. జాంబీ సినిమాలు ఇదివరకు చాలానే వచ్చాయి. అయితే ఈ మూవీలో జాంబీలు చేసే రచ్చ మామూలుగా ఉండదు. మూవీ లవర్స్ కి ఈ మూవీ బెస్ట్ ఎంటర్టైన్ ఇస్తుంది.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×