BigTV English

Hibiscus For Hair: మందారతో అద్భుతం.. ఇలా వాడితే జుట్టు ఊడమన్నా ఊడదు

Hibiscus For Hair: మందారతో అద్భుతం.. ఇలా వాడితే జుట్టు ఊడమన్నా ఊడదు

Hibiscus For Hair: పొడవైన జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. జుట్టు పెరగడం కోసం రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. బయట మార్కెట్‌లో దొరికే షాంపూలు, ఆయిల్స్ వల్ల పెద్దగా ఫలితం లేకపోగా.. నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంట్లోనే మందార పూలతో హెయిర్ మాస్క్ తయారు చేసుకుని వాడటం మంచిది. దీని వల్ల అనేక లాభాలు ఉంటాయి. అంతే కాకుండా జుట్టు కూడా బాగా పెరుగుతుంది. రాలకుండా కూడా ఉంటుంది.


మందార పూలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఈ పూలలో యాంటీ ఆక్సిడెంట్లు, అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు మెరిసేలా చేస్తుంది.

మందార పూలు అనేక జుట్టు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. మందారలో ఉండే సహజ యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టును మెరిసేలా మరియు సిల్కీగా మార్చుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న మందార పూలతో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మందార వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు:

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: మందారలో ఉండే యాంటీఆక్సిడెంట్లు జుట్టు రంధ్రాలను బలోపేతం చేస్తాయి. తద్వారా ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

జుట్టును బలపరుస్తుంది: ఇందులో ప్రొటీన్ ఉంటుంది, ఇది జుట్టును బలపరుస్తుంది మరియు విరిగిపోకుండా చేస్తుంది.

జుట్టును మెరిసేలా చేస్తుంది: మందారలో ఉండే సహజ నూనెలు జుట్టును హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తాయి.

జుట్టును సిల్కీగా చేస్తుంది:మందార జుట్టును మృదువుగా, సిల్కీగా చేస్తుంది.దువ్వెనను సులభతరం చేస్తుంది.

స్కాల్ప్ సమస్యలను తగ్గిస్తుంది: ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది తలలో మంట మరియు దురదను తగ్గిస్తుంది.

1.మందార, పెరుగు మాస్క్:
కావలసినవి:
మందారం రేకులు- 1 కప్పు
పెరుగు- 1 కప్పు

అప్లై చేయు విధానం: ముందుగా పైన చెప్పిన మోతాదులో మందార పూలను తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో పెరుగు వేసి మిక్స్ చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత వాష్ చేసుకోండి. ఇలా చేయబడం ద్వారా జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది.

2. మందార, తేనె హెయిర్ మాస్క్:
కావలసినవి:
మందార పూలు- 1 కప్పు
తేనె- 2 టేబుల్ స్పూన్లు

అప్లై చేయు విధానం: 1 కప్పు తాజా మందారం రేకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. దానికి 2 టీస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మాస్క్‌ను మీ జుట్టు, తలపై అప్లై చేయండి.30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది.

Also Read: అలోవెరా ఇలా వాడితే.. మీ జుట్టు విపరీతంగాపెరుగుతుంది తెలుసా ?

3. మందార, గుడ్డు హెయిర్ మాస్క్:
కావలసినవి:
మందార పూలు- 1 కప్పు
ఎగ్- 1
అప్లై చేయు విధానం: 1 కప్పు తాజా మందారం రేకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేయండి. దానికి 1 ఎగ్ తెల్లసొన వేసి బాగా కలపాలి. దీనిని మీ జుట్టుకు అప్లై చేయండి.
30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగేయండిజ ఈ హెయిర్ మాస్క్ తరుచుగా వాడటం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×