BigTV English

Galla Madhavi Iskcon Issue: చిక్కుల్లో గల్లా మాధవి.. బాబు యాక్షన్ తప్పదా..?

Galla Madhavi Iskcon Issue: చిక్కుల్లో గల్లా మాధవి.. బాబు యాక్షన్ తప్పదా..?

Galla Madhavi Iskcon Issue: ఏ విషయమైనా ఆచి చూచి అడుగులు వేయమని పెద్దలు సలహా ఇస్తుంటారు. అన్నీ మనకు తెలుసని అనుకోవటంలో తప్పకుండా ఇబ్బందులు ఉంటాయనేది పై మాటకు అర్థం. మరి ముఖ్యంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు, ప్రముఖులు ఈ మాటలని చాలా బలంగా ఫాలో అవుతుంటారు. కానీ ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే పరిస్థితి మాత్రం ఆ మాటలను ఫాలో అవ్వడం లేదనేలా ఉంది. ఆ ప్రజా ప్రతినిధి తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆమెకే రివర్స్ అయ్యి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఆ లేడీ ఎమ్మెల్యే ఎవరో తెలియాలంటే వాచ్ థిస్ స్టోరీ..


కులం, మతం అనేవి సమాజంలో చాలా డెలికేట్ అంశాలు. ప్రజల మనోభావాలకు సంబంధించిన ఈ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ప్రజలను ప్రభావితం చేయగలరు కాబట్టి మరి ముఖ్యంగా జాగ్రత్తగా ఉంటుంటారు. కానీ ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యవహారం మారుతోంది. తానొకటి చేయబోతే మరొకటి జరిగినట్టు.. ఇస్కాన్ సభ్యుల వ్యవహారంలో ఎమ్మెల్యే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకైక మహిళ ఎమ్మెల్యేగా గల్లా మాధవి విజయం సాధించారు. కూటమి ప్రభుత్వ అదృష్టమొ.. గల్లా మాధవి అదృష్టమొ కానీ.. గల్లా మాధవి విక్టరీ కొట్టారు. ప్రత్యర్థి మాజీమంత్రి విడుదల రజిని అయినప్పటికీ ఆమెపై విజయం కూడా భారీ స్థాయిలో మెజారిటీ సాధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకైక మహిళ ఎమ్మెల్యే కావడంతో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. నియోజవర్గ అభివృద్ధిలో భాగంగా అనేక అంశాలపై దృష్టి పెడుతున్న మాధవి.. పలు విషయాల్లో మాత్రం ఎదురు దెబ్బలు తగిలించుకుంటున్నారు.


గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు వివాదాస్పదంగా మారింది. నగరంలోని పలు రోడ్లపై కొందరు ఇస్కాన్ సభ్యులు భగవద్గీత పుస్తకాల అమ్మకాలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇస్కాన్ సభ్యులపై గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై పుస్తకాల అమ్మేందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ ప్రశ్నించారు. దీనిపై ఇస్కాన్ సభ్యులు సైతం అదే రేంజ్‌లో బదులిచ్చారు. తాము బంగ్లాదేశ్‌లో లేము ఇండియాలోనే ఉన్నామంటూ సమాధానం చెప్పారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మాధవి వారితో ప్రవర్తించిన విధానంపై విమర్శలు వచ్చాయి. హిందూ సంఘాలు సైతం ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయట.

Also Read: గ్రంధి శ్రీనివాస్ మనో వేదనకు అసలు కారణం ఏంటి? అందుకే పార్టీకి బై బై!

ఈ ఘటనపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి వివరణ ఇచ్చారు. రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో తనను ఇబ్బందులు పెట్టాలనే కొందరు కావాలనే తన సంభాషణను వక్రీకరించినట్టు చెప్పారామె. కూడళ్లలో ట్రాఫిక్ సమస్యపై మాత్రమే తాను మాట్లాడానని.. ఇస్కాన్ సభ్యుల భగవద్గీత విక్రయాలకు ఎలాంటి అడ్డు చెప్పలేదన్నారు. ఇస్కాన్ వారిపై తాను ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదని తెలిపారు. కేవలం ఆ కూడలిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉన్నందున.. కొంచెం పక్కకి వెళ్లి విక్రయాలు చేపట్టాలని మాత్రమే అన్నట్టు పేర్కొన్నారు.

గతంలోనూ రియల్ ఎస్టేట్ కి సంబంధించి అంశంలో ఆమెతో పాటు ఆమె భర్త కూడా మీడియా ముందు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలు వచ్చాయి. ఓ క్లబ్బుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆమె తీరుపై కొంత అధిష్టానం సీరియస్ అయినట్టు అప్పట్లో మాటలు వినిపించాయి. ఇప్పుడు ఇస్కాన్ విషయంలో కూడా గల్లా మాధవి ఏ ఉద్దేశంతో చేసినప్పటికీ.. జరగాల్సిన నష్టం అయితే కొంతమేర జరిగిందనేది మాత్రం పార్టీలోనూ, పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా అనవసర అంశాల జోలికి పోకుండా తాను ఏదైతే టార్గెట్ పెట్టుకున్న విధానం ఉందో.. ఆ వైపుగా విజయవంతంగా ముందుకు వెళ్తే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×