BigTV English

OTT Movie : దేవర లాంటి హాలీవుడ్ మూవీ.. ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : దేవర లాంటి హాలీవుడ్ మూవీ.. ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : ఇప్పుడు సముద్రం అంటే గుర్తుకు వచ్చేది దేవర మూవీనే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం జోరుగా ప్రమోషన్లు నడుస్తుండగా, ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర హడావిడి నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే దేవర లాంటి ఒక హాలీవుడ్ మూవీ గురించి చెప్పుకోబోతున్నాం. రెండు సినిమాల స్టోరీ డిఫరెంట్ అయినప్పటికీ, బ్యాక్ డ్రాప్ మాత్రం ఒకటే. కాబట్టి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.


కథ విషయానికి వస్తే..

ఈ సినిమాలో హీరో ఒక యానిమల్ హంటర్. జంతువులను వేటాడి ఏకంగా స్మగ్లింగ్ లాంటిది చేస్తూ ఉంటాడు. ఇలాంటి ప్రమాదకరమైన జాబ్ చేసే హీరో ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఒకానొక టైంలో అతను సమస్యల్లో పడతాడు. ఎప్పటిలాగే అతని సమస్యకు కారణం పోలీసులే అవుతారు. అసలు ఏం జరుగుతుంది అంటే హీరో కొన్ని జంతువులని తీసుకొని స్మగ్లింగ్ చేయాలి అనుకుంటాడు. అందులో భాగంగానే ప్రమాదకరమైన విష సర్పాలు, జంతువులను బంధించి తన ఓడలో సముద్రంపై ప్రయాణానికి సిద్ధమవుతాడు. ఇలాంటి వ్యక్తి ఓడలో అత్యంత డేంజరస్ అయిన క్రిమినల్ ను షిఫ్ట్ చేయడానికి పోలీసులు ప్లాన్ చేస్తారు. కానీ ఆ ప్రయత్నం మధ్యలోకి వెళ్ళగానే క్రిమినల్ కారణంగా బెడసి కొడుతుంది. క్రిమినల్ హీరోకి ఎలాంటి సమస్యలు తెచ్చి పెట్టాడు? పోలీసులు హీరోకి ఏమైనా హెల్ప్ చేయగలిగారా లేదా ? హీరో ఆ జంతువులని నట్ట నడి సముద్రంలో ఎదురైన సమస్యల నుంచి ఎలా కాపాడాడు ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ప్రైమల్ అనే ఈ సినిమాను లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడండి.


Primal - Movie - Where To Watch

బెస్ట్ థ్రిల్లర్ 

2019లో రిలీజైన హాలీవుడ్‌ చిత్రం ‘ప్రైమల్‌’ ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు నికోలస్‌ కేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థ్రిల్లర్‌ మూవీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్  అని చెప్పాలి. నిక్‌ పావెల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ దాదాపు 70 శాతం సముద్రంలో ఉన్న ఓడలోనే సాగుతుంది. ఇప్పటికే ఇలాంటి కథతో తెలుగులో లైఫ్ ఆఫ్ పై అనే సినిమా వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. మరో హాలీవుడ్ నటుడు కెవిన్‌ తన నటనతో అదరగొట్టాడు. హీరో, విలన్ ఇద్దరూ సినిమాకే హైలెట్‌గా నిలిచారని చెప్పాలి. అద్భుతమైన  స్క్రీన్‌ ప్లేతో పాటు సినిమా నిడివి తక్కువ ఉండడం ప్లస్ ఈ మూవీకి ఉన్న ప్లస్ పాయింట్స్. థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాలు అంటే చెవి కోసుకునే ప్రేక్షకులకు ఈ ‘ప్రైమల్‌’ సినిమా బాగా నచ్చుతుంది. అలాగే జానర్ ఏదైనా సరే సినిమా హాలీవుడ్ అయితే చాలు అనుకునే మూవీ లవర్స్ కు కూడా ఈ సినిమా బెస్ట్ ఆప్షన్. అయితే లాంగ్వేజ్ బారియర్ అడ్డు కాదు అనుకునే వారే ఈ సినిమాను చూడగలరు. ఎందుకంటే ఈ సినిమా ఇంకా తెలుగులో అందుబాటులోకి రాలేదు.

Related News

OTT Movie : పెళ్లి కోసం అల్లాడే సాఫ్ట్వేర్… చక్కిలిగింతలు పెట్టే కన్నడ కామెడీ మూవీ

OTT Movie : భర్తపై అనుమానంతో భార్య అరాచకం… మంత్రి కూతురా మజాకా ? మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ట్రాన్స్ జెండర్ పై మోహం… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Movie : అర్దరాత్రి అపార్ట్మెంట్లో వింత సౌండ్స్… డోర్ తీస్తే గుండె జారిపోయే సీన్లు… ఈ హర్రర్ మూవీ అరాచకం సామీ

OTT Movie : 86 మంది సజీవ దహనం, 1.5 లక్షల ఎకరాలు ధ్వంసం… వణికించే ట్రూ వైల్డ్ ఫైర్ సర్వైవల్ డ్రామా

OTT Movie : డబ్బు కోసం డర్టీ గేమ్స్… ప్రపంచ కుబేరుడిని బురిడీ కొట్టించి కోట్లు కొల్లగొట్టే రూత్లెస్ థీఫ్… నెవర్ బిఫోర్ హీస్ట్ థ్రిల్లర్

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

Big Stories

×