BigTV English

Gundeninda GudiGantalu Serial Today Episode September 23 : బాలుకు రవి, శృతి ప్రేమ గురించి నిజం చెప్పిన మీనా.. మర్చిపోవాలని రవికి వార్నింగ్…

Gundeninda GudiGantalu Serial Today Episode September 23 : బాలుకు రవి, శృతి ప్రేమ గురించి నిజం చెప్పిన మీనా.. మర్చిపోవాలని రవికి వార్నింగ్…

Gundeninda GudiGantalu Serial Today Episode September 23 : గత ఎపిసోడ్ లో శృతి మీనా ఇంటికి వస్తుంది. తన ప్రేమ విషయాన్ని మీనాకు చెబుతుంది. మీనా టెన్షన్ పడుతూ మర్చిపోవడం కుదరదా అని చెబుతుంది. ఇక శృతి నీతో పనికాదు అని నేను మీ అత్తతో చెబుతాను అంటుంది. అప్పుడే ప్రభావతి, రోహిణి ఇంటికి వస్తారు. అది చూసి టెన్షన్ పడుతుంది మీనా.. శృతిని పంపించి వస్తుంది. మీనా టీ ఇవ్వమని అంటారా అని అడుగుతుంది. కళ్ళు ఏమైనా పోయాయా జ్యూస్ లో టీ కలుపుకొని తాగమని అంటావా అని చెబుతుంది. అవునా వద్దా అని చెబుతుంది. రోహిణి, ప్రభావతి మీనా మీద అనుమానం కలుగుతుంది అని మాట్లాడుకుంటారు. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ లో చూస్తే.. శృతి ఇంటికి వస్తుంది. వాళ్ల అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతారు. దానికి నీకు పెళ్లి సంబంధం చూసాము ఇక అన్ని బుద్దిగా ఉండు అని శృతి వాళ్ల అమ్మ అంటుంది. దానికి శృతి నా పెళ్లిని డిసైడ్ చెయ్యడానికి మీరెవ్వరు నన్ను అడిగి చేశారా అని గట్టిగా వాదిస్తుంది. నువ్వేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు.. నిన్ను కన్నాం పెద్ద చేసాము పెళ్లి చేసే హక్కు మాకుంది అంటుంది. దానికి శృతి మీరు విడాకులు తీసుకుంటారా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ అంటే మీరు విడాకులు తీసుకోమంటే అరుస్తారు. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని అంటుంది. ఇక వాల్ల నాన్న ఆ అబ్బాయికి చాలా ఆస్తులు ఉన్నాయి. అతన్ని చేసుకుంటే నువ్వు హ్యాపిగా ఉంటావని చెబుతాడు. దానికి శృతి ఇల్లీగల్ బిజినెస్ లు చేసేవాడు నాకు నచ్చలేదని చెబుతుంది. దానికి నువ్వు ఆ రవి వెనుక తిరుగుతున్నావ్ అది మాకు తెలియదా.. నువ్వు డబ్బింగ్ చెప్పడం కూడా ఆపేసి ఇంట్లో ఉండు.. పెళ్లికి కొద్ది రోజులే ఉన్నాయని చెబుతారు. అతను నాకు నచ్చలేదు అంటే పెళ్లి అయితే అదే సర్దుకుంటుంది అని అంటాడు..

Gundeninda GudiGantalu Serial Today Episode September 23
Gundeninda GudiGantalu Serial Today Episode September 23 :

ఇక మీనా శృతి, రవి ల విషయాన్ని బాలుకు చెప్పాలని ప్రయత్నిస్తుంది.. మీతో మాట్లాడాలని చెబుతుంది. ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. మీరు అలా పరుగేడితే ఎలా కూర్చోండి అని రవి, శృతి ల ప్రేమ వ్యవహారం గురించి బయట పెడుతుంది. నేను అనుకున్నదే జరిగింది. ఆ రవికి ముందే చెప్పాను ఇలాంటివి చేస్తే ఊరుకొనేది లేదని కానీ ఇలా చేస్తాడా.. దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా వద్దనకుండా అని అంటాడు బాలు… నేను సపోర్ట్ చేస్తే నా చెంప పగులుతుందని తెలుసుగా నేను ఎందుకు చెబుతానని మీనా అంటుంది. ఇప్పటికే మా నాన్నకు మనశాంతి లేదు. ఒకడేమో లక్షలు దొబ్బెవాడు. మరొకడు రౌడీ, తాగుబోతు.. ఇదేదో రవినే అడిగి తెలుసుకుంటాను అని అక్కడకు వెళ్తాడు. రవిని పిలిచి రెస్టారెంట్ లో కడిగి పడేస్తాడు.


అరేయ్ నాన్న తల దించుకొనే పనిని ఎందుకు చేస్తున్నావ్.. నీకు తెలుసు కదా ఆ వ్యక్తి నాన్న మీద కోపంతో పింఛన్ కూడా ఆపేసాడు. ఇప్పుడు ఆయన కూతురినే ప్రేమిస్తావా ఇక మర్చిపో అని బాలు వార్నింగ్ ఇస్తాడు. అక్కడ నుంచి వస్తాడు. ఇక ప్రభావతి అటు ఇటు తిరుగుతుంది. అప్పుడే కృష్ణ మూర్తి అక్కడకు వస్తాడు. ఏంటే కాలు కాలిన పిల్లిలాగా అలా తిరుగుతున్నావ్ అని అడిగితే దానికి నాకేం కాలు కాలలేదు అని సమాధానం చెబుతుంది. ఇక ఏమైంది అంటే కొడుకు గొప్పగా ఉండాలని అనుకోవడం తప్పా అని అడుగుతుంది. దానికి అతను ఆశలకు పోయి ఆలోచించడం తప్పు అంటాడు. దానికి ప్రభావతి సీరియస్ అవుతుంది..

Gundeninda GudiGantalu Serial Today Episode September 23 :
Gundeninda GudiGantalu Serial Today Episode September 23 :

ఇక మీనా బాలులు మాట్లాడుకుంటారు. మీరు ఏదైన మొండిగా ఆలోచిస్తారు.. రవి, శృతి ల విషయం మీ నాన్నకు చెబితే.. ఇరు కుటుంబాలను ఒక చోట తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే బెటర్ కదా ఏదైన ఆలోచన వస్తుందని మీనా బాలుతో అంటుంది. కానీ బాలు మా నాన్న దగ్గరకు ఇది వెళ్లడం కుదరదు అని అంటాడు. ప్రేమికులను విడదీయం మహా పాపం అని అంటాడు. ఇక మీనా మీరు మొండిగా ఉంటే ఎలా అని అడుగుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో మీనా గురించి ప్రభావతి ఆలోచిస్తుంది. దాంతో శృతి గురించి అసలు నిజం ఇంట్లో తెలుస్తుందా? రవి, శృతి ల ప్రేమ కోసం మీనా ఏం చేస్తుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×