OTT Movie : హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే యాక్షన్ మూవీస్ కి మన ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. యాక్షన్ మూవీస్ తర్వాత అంతలా రొమాంటిక్ మూవీస్ ని కూడా ఇష్టపడతారు. రొమాంటిక్ మూవీస్ ను తీయడంలో హాలీవుడ్ ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. వాటిని చూసే మూవీ లవర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? స్టోరీ ఏమిటో?తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి. మంచి స్టోరీ తో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు మరి ఏమిటో కాదు “క్విల్స్” (Quills) ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazan Prime Video)లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ నటించడం విశేషం.
స్టోరీ లోకి వెళితే
ఈ మూవీలో హీరోయిన్ జైలులో చాకలి వృత్తి చేసుకుంటూ ఉంటుంది. అందులోనే మార్కస్ అనే ఖైదీ రొమాంటిక్ రచనలు చేస్తూ ఉంటాడు. ఈ రచనలను హీరోయిన్ ఇష్టపడుతూ ఉంటుంది. అయితే ఈ జైలులోనే ఖైదీలలో మార్పు తేవడానికి ఒక ఫాదర్ కూడా ఉంటాడు. హీరోయిన్ ఫాదర్ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. మార్కస్ రచనలను హీరోయిన్ ఎవరికీ తెలియకుండా బయటకు పంపి వాటిని పబ్లిష్ చేపిస్తుంది. నిజానికి ఈ రచనలను రాయడం వలన రాజు అతనిని జైలులో బంధిస్తాడు. హీరోయిన్ వలన ఆ రచనలు బయటకు వెళ్లి పబ్లిష్ అవడంతో ఆ విషయం రాజుకు తెలుస్తుంది. ఇంతలోనే మార్కస్ హీరోయిన్ ని ఒకసారి తన దగ్గరికి పిలుచుకొని నా దగ్గర ఒక అద్భుతమైన స్టోరీ ఉంది. అయితే ఆ కథ నీకు వినిపించాలి అంటే పేజికి ఒక ముద్దు ఇవ్వాలి అని కోరుతాడు.
ఆ రచనలను హీరోయిన్ ఇష్టపడుతూ ఉండటంతో ముద్దులే కదా అని ఆ కండిషన్ కి ఒప్పుకుంటుంది. అయితే మార్కస్ ముద్దులతో ఆగడు ఆమెను గట్టిగా పట్టుకొని బలవంతం చేయబోతయాడు. అతడి నుంచి తప్పించుకొని బయటికి వచ్చిన హీరోయిన్ ఫాదర్ ని కలుస్తుంది. నువ్వు ఎప్పుడూ ఇక్కడికి ఒంటరిగా రావద్దని చెప్తాడు. ఈలోగా రాజు మార్కస్ దగ్గరికి తన మనుషులను పంపుతాడు. మార్కస్ ని మొదట చంపాలని అనుకున్న రాజు ఆ తరువాత అతని రచనలను చంపాలి అనుకుంటాడు. ఎందుకంటే అతని రచనలలో శృంగారం ఎక్కువగా ఉంటుంది. అతని మాటలను లెక్కపెట్టని మార్కస్ ని రాజు ఏం చేస్తాడు? హీరోయిన్ ఫాదర్ లవ్ ట్రాక్ చివరికి ఏమవుతుంది? అతని రచనల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న క్విల్స్ మూవీని తప్పకుండా చూడండి. మసాలా కంటెంట్ ఈ మూవీలో ఎక్కువగానే ఉంటుంది. ఈ మూవీని చూస్తూ రొమాంటిక్ మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.ఈ బో*ల్డ్ మూవీని ఒంటరిగా చూడడమే బెటర్.