BigTV English

Bigg Boss Sonia : బిగ్ బాస్ వల్ల సోనియాకు భారీ నష్టం.. కట్టుకోబోయే వాడు కూడా..

Bigg Boss Sonia : బిగ్ బాస్ వల్ల సోనియాకు భారీ నష్టం.. కట్టుకోబోయే వాడు కూడా..

Bigg Boss Sonia : వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో సీజన్ 8 ప్రసారం అవుతుంది. ఈ షోలో ప్రస్తుతం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన వారిదే హావ నడుస్తుంది.. ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో చివరగా మెహబూబ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. తొమ్మిదో వారం నామినేషన్స్ రసవత్తరంగా మారాయి.. ఈ వారం పృథ్వీ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు అప్పుడే వార్తలు బయటకు వచ్చేసింది. అయితే ఈ సీజన్ లో సోనియా ఆకుల కూడా పాల్గొన్నారు. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ పాల్గొన్నారు. దాంతో మరోసారి బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


బిగ్ బాస్ ఫెమస్ సోనియా ముక్కు సూటిగా మాట్లాడే మనిషి. తన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు. ఏది అనుకుంటే అది జరుగుతుంది అని కఠినంగా మాట్లాడేది. అందుకే హౌస్ లో మొదటి నుంచి అందరికి ఈమె అంటే కోపం.. అయితే ఎవరు ఊహించని విధంగా సోనియా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఆమెలో మరో కోణాన్ని బయట పెడుతూ బయట పెడుతూ వస్తుంది. బిగ్ బాస్ తన రేటింగ్ కోసం తనను తప్పుగా చూపించి బలి చేసిందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. ఇక తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితం నాశనం అయ్యిందని గోడు వెళ్ళబోసుకుంది. దానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ అమ్మడు ఒకవేళ నేను ఏదైనా చేసుకొని చనిపోతే ఎవరు రెస్పాన్సిబులిటీ అని ప్రశ్నించింది. నాగార్జున బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ మెమొరీ అంటుంటారు.కానీ ఇది లైఫ్ టైం మెమొరీ కాదు నా జీవితంపై మచ్చ వేసే ప్రయత్నం అని చెప్పుకొచ్చారు. వాళ్లకు కావాల్సిన కంటెంట్ కోసం వారు ఏదైనా చేస్తారు ఎవరి జీవితం ఎటు పోయిన వారికి పర్లేదు అంటూ బిగ్ బాస్ పై తీవ్రస్థాయిలో మండి పడింది. నేను ఎక్కడైతే సీరియస్ అవుతానో ఆ వీడియోస్ మాత్రమే బిగ్ బాస్ వారు ప్రసారం చేసి నన్ను ఒక విలన్ లా చూపించారు. పృథ్వి నిఖిల్ లను హగ్ చేసుకున్నది జూమ్ చేసి మరీ చూపించారు. అక్కడ మా మధ్య తప్పుడు సంబంధం ఉందని చూపించారు. అయితే ఇటీవలే పెళ్లి ఫిక్స్ చేసుకున్న ఈ అమ్మడును బిగ్ బాస్ హౌస్ లో అలా చూసిన కాబోయే భర్త పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతుంది. మరి దీనిపై బిగ్ బాస్ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఇక ఈ సీజన్ కు విష్ణు ప్రియా విన్నర్ అయ్యే అవకాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఎవరు అవుతారో చూడాలి.


Tags

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×