OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీస్ మూవీ లవర్స్ ను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఈ రొమాంటిక్ మూవీలలో కొన్ని సీన్స్ వేడి పుట్టించే విధంగా ఉంటాయి. వాటి కోసమే మూవీ లవర్స్ కల్లార్పకుండా చూస్తారు.అందులోనూ హాలీవుడ్ రొమాంటిక్ మూవీస్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అటువంటి ఒక రొమాంటిక్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video)
ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు “రంబ్లింగ్ రోజ్” (Rambling rose). వయసులో ఉన్న ఒక అమ్మాయి తన కోరికలను అదుపు చేసుకోలేక పడే తపనను ఈ మూవీలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
రోసీ ఒక ఇంటిలోకి పనిమనిషి అవసరం ఉండటంతో పనిచేయడానికి వెళుతుంది. ఆమె వయసులో ఉండటంతో ఆ ఇంట్లో బడ్డీ అనే స్కూల్ కుర్రాడు ఆకర్షితుడవుతాడు. రోసి కోరికలతో ఎప్పుడూ తపించిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బడ్డీ తండ్రిని ఒకసారి రెచ్చగొడుతుంది. అతడు కూడా ఏకాంతంగా గడపడానికి ముందుకు వెళ్తాడు. అయితే మధ్యలోనే ఆ పనిని విరమించుకుంటాడు. మనం చేస్తున్న పని తప్పు అని ఆమెకు సర్ది చెప్తాడు. ఇలా ఉంటే అప్పుడే వయసులోకి వచ్చిన బడ్డీ ఆమెతో ఒక్కసారైనా ఏకాంతంగా గడపాలని తహతహలాడుతుంటాడు. అయితే రోసి బడ్డీతో నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి, కాస్త టైమ్ ఉందంటూ నచ్చ చెప్తుంది. రోసి కోసం ఆ ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఒకరోజు రోసి ఏకాంతంగా ఎవరితోనో ఉండగా బడ్డీ తండ్రి చూస్తాడు. ఆమెకు వార్నింగ్ ఇచ్చి ఇంటిలో నుంచి వెళ్ళిపొమ్మని చెప్తాడు. అయితే నాకు మీరు తప్ప ఎవరు తెలియదు, నేను ఇక్కడనుంచి వెళ్లలేనని ఆమె వాళ్ళకు చెప్తుంది.
ఒకవేళ ఇంటికి వెళితే నన్ను వేశ్యగా మారుస్తారని వేడుకుంటుంది. ఆమెకు ఉన్న ప్రాబ్లం ని డాక్టర్ కి చూపిస్తాడు బడ్డీ తండ్రి. ఆమెకు కొన్ని మందులు ఇచ్చి మైండ్ ని కంట్రోల్ లో పెట్టుకోమని డాక్టర్ సలహా ఇస్తాడు. ఇలా ఉంటే ఒకరోజు అనుకోకుండా ఆమె ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయం తెలిసి బడ్డి చాలా బాధపడతాడు. చివరికి రోసి పెళ్లి చేసుకుందాం? బడ్డీ ఆమెతో ఏకాంతంగా గడపగలుగుతాడా? ఆ కోరికలను ఆమె అదుపులో పెట్టుకోగలుగుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “రంబ్లింగ్ రోజ్” (Rambling rose) అనే యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీని ఒంటరిగా చూడటమే బెట్టర్.