Homemade Shampoo: ప్రతి అమ్మాయి పొడవాటి జుట్టు ఉండాలని కోరుకుంటుంది. అందుకోసం రకరకాల హెయిర్ ఆయిల్స్‌తో పాటు షాంపూలను కూడా వాడుతుంటారు. కానీ వాటిలో ఉండే కెమికల్స్ జుట్టుకు హాని కలుగజేస్తాయి. ఇలాంటి కెమికల్స్ ఉన్న షాంపూలను వాడకుండా ఇంట్లోనే షాంపూలను తయారు చేసుకుని వాడవచ్చు. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
ఇదిలా ఉంటే.. ఎలాంటి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడకపోయినా కాలుష్యం, దుమ్ము, ఇతర కారణాల వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది. కొంత అశ్రద్ద చేసినా కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అందుకే ఇంట్లోనే షాంపూ తయారు చేసుకుని వాడటం మంచిది. మరి హోం మేడ్ షాంపూ ఎలా తయారు చేసుకుని వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హోం మేడ్ షాంపూ తయారీ:
కావలసినవి:
బియ్యం- 2 టేబుల్ స్పూన్లు
మెంతి గింజలు- 1 టేబుల్ స్పూన్
అవిసె గింజలు- 2 టేబుల్ స్పూన్లు
కుంకుడు కాయలు- 1 చిన్న కప్పు కప్పు
గోండ్ కటిరా- 2 టేబుల్ స్పూన్లు
అలోవెరా- 2 టేబుల్ స్పూన్లు
షాంపూ ఎలా తయారు చేయాలి ?
ఈ షాంపూ తయారు చేయడానికి ముందుగా పైన తీసుకున్న ప్రతిదీ రెండు మూడు సార్లు నీటిలో బాగా కడగాలి. తర్వాత ఈ వస్తువులను 7 నుండి 8 గంటలు నానబెట్టండి. అనంతరం 1 కప్పు నీటిలో వీటిని వేసి 10-15 నిమిషాల పాటు ఈ పదార్థాలన్నీ బాగా ఉడకబెట్టండి. తర్వాత వడకట్టిండి. ఇప్పుడు ఇది మందపాటి పేస్ట్ లాగా తయారు అవుతుంది. ఈ పేస్ట్‌ను ఒక కంటైనర్‌లో నింపి తల స్నానం చేసేటప్పుడు ఉపయోగించండి. మీరు ఈ షాంపూని ఒక వారం పాటు నిల్వ చేయవచ్చు.
ఈ షాంపూ ప్రయోజనాలు:
బియ్యం : బియ్యం జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. బియ్యం నీరు జుట్టు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇందులోని పోషకాలు జుట్టు పెరగడానికి దోహదం చేస్తాయి.
మెంతి గింజలు: మెంతి గింజలు ప్రోటీన్ , నికోటినిక్ యాసిడ్‌లను కలిగి ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ అందిస్తాయి. అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు చుండ్రు రాకుండా చేస్తాయి.
Also Read: రోజ్ వాటర్‌లో ఈ ఒక్కటి కలిపి రాస్తే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం
అవిసె గింజలు: అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును బలంగా, ఆరోగ్యంగా చేస్తాయి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
కుంకుడు కాయలు: ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఇది జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.వీటిని వాడటం వల్ల జుట్టు పెరుగుదల కూడా చాలా బాగుంటుంది.
గోండ్ కటిరా: గోండ్ కటిరా జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. దీంతో జుట్టును మెరుగుపరుస్తుంది. జుట్టు కండిషనింగ్‌కు ఇది ఉత్తమమైంది.
అలోవెరా: కలబంద జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మందంగా మారడానికి సహాయపడుతుంది. ఇది జుట్టుకు తక్షణ తేమను కూడా అందిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.