OTT Movie : ఓటిటిలో ఎన్నో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. వెబ్ సిరీస్ లలో వచ్చిన ఒక తాంత్రిక సిరీస్ ఓటిటి లో హల్చల్ చేసింది. ఈ సిరీస్ పేరేమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
జియో సినిమా (Jio Cinema)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాల్ వెబ్ సిరీస్ కు ఓటీటీ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ తాంత్రిక విద్యలు నేర్చుకున్న ఒక వ్యక్తి, ఆ విద్యని మంచి కోసం కాకుండా, డబ్బు సంపాదించడానికి మాత్రమే వాడుతుంటాడు. ఈ సీరిస్ తారానాద్ అనే తాంత్రికుడి చుట్టూ తిరుగుతుంది. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ పేరు “తారానాద్ తాంత్రిక్” (Taranath Tantrik) ఈ వెబ్ సిరీస్ జియో సినిమా (Jio Cinema) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు ఈ సిరీస్లో చాలానే ఉన్నాయి. ఒక నిజమైన అఘోరీ జీవిత చరిత్ర ఆధారంగా ఈ వెబ్ సెరిస్ ను తెరకెక్కించారు మేకర్స్.
స్టోరీలోకి వెళితే
తారనాద్ ఒక గొప్ప తాంత్రిక గురువుగా ఉంటూ పేరు సంపాదిస్తాడు. ఒకరోజు ఇతని దగ్గరికి కిషోర్, అశ్విన్ ఇద్దరు వ్యక్తులు తారనాద్ ను కలవడానికి వస్తారు. తరానాద్ వాళ్ల సమస్యలను వాళ్ళు చెప్పకుండానే, చిన్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలను కూడా తెలియజేస్తాడు. వాళ్లకు తారనాద్ మీద బాగా నమ్మకం పెరిగి అతని దగ్గర శిష్యులు గా చేరుతారు. అయితే తారానాథ్ తన చిన్నతనం నుంచి తాంత్రిక విద్యలలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. సిద్ధిసాధకి దగ్గర తన తంత్రవిద్యాలన్నీ నేర్చుకుంటాడు. ఆ విద్యలను నేర్చుకోవడానికి తారనాద్ కఠోర సాధన చేస్తాడు. ఇతని దగ్గరికి రాజకీయ నాయకులతో సహా వేల మంది దర్శనం కోసం వస్తూ ఉంటారు. అయితే తరనాద్ తన తంత్రవిద్యని డబ్బు సంపాదించడం కోసమే ఎక్కువగా వినియోగిస్తాడు. అలా వినియోగించడం వలన తాంత్రిక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే తాంత్రిక శక్తిని అలా చెడుకు వాడుకూడదని సాధువులు చెప్తారు. అతను తన దారిని మార్చుకోకుండా ఎప్పుడూ డబ్బుపైనే వ్యామోహం వ్యామోహం పెట్టుకుంటాడు. ఈ తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి తారనాద్ చాలా కష్టపడి ఎంతో ఓర్పుతో నేర్చుకుంటాడు. అతని బుద్ధి వక్రదారి పడుతూ ఉంటుంది.
అతని దగ్గర ఆ విద్యలు ఎవరైనా ఆడవాళ్లు నేర్చుకోవాలంటే, అతనితో ఏకాంతంగా గడపాల్సిందే. ఈ తాంత్రిక విద్యలతో అతడు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? తారనాద్ శక్తులు చివరికి తరిగిపోతాయా? ఈ తాంత్రిక శక్తులను ఎవరి మీద అయినా అనవసరంగా ప్రయోగిస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే జియో సినిమా (Jio Cinema) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ తారనాద్ తాంత్రిక్ సస్పెన్స్ వెబ్ సిరీస్ ని తప్పకుండా చూడండి. ఈ వెబ్ సిరీస్ ఒక అగోరి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీయబడింది. తాంత్రిక సినిమాలను చూసే మూవీ లవర్స్ ఈ తారానాద్ తాంత్రిక్ (Taranath Tantrik) వెబ్ సిరీస్ ను చూసి బాగా ఎంటర్టైన్ అవుతారు. ఈ మూవీలో అఘోరీ తంత్రాలను చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది. మరి ఎందుకు ఆలస్యం ఈ బెంగాలీ వెబ్ సిరీస్ పై ఓ లుక్ వేయండి.