BigTV English

OTT Movie : థ్రిల్ కోసం చంపే సైకో కిల్లర్ అమ్మాయి అయితే…. బుర్ర పాడు చేసే క్లైమాక్స్

OTT Movie : థ్రిల్ కోసం చంపే సైకో కిల్లర్ అమ్మాయి అయితే…. బుర్ర పాడు చేసే క్లైమాక్స్

OTT Movie : సైకో కిల్లర్ ఈ పేరు వింటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇటువంటి సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. అందులోనూ హాలీవుడ్ సైకోలు అంటే అదో రకంగా ఉంటారు. వీళ్ళు హింసను ఎక్కువగా చూపిస్తారు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక సైకో కిల్లర్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ సైకో కిల్లర్ మూవీ పేరు ‘రోడ్ గేమ్స్‘ (Road games). హీరో హీరోయిన్లు సైకోల చేతిలో పడతారు. వాళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరో లండన్ నుంచి ప్యారిస్ కి వస్తాడు. తన కారు రిపేర్ అవడంతో, కొంతమందిని లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. ఆ ప్రాంతంలో దొంగలు ఎక్కువగా ఉండటం వలన ఎవరూ లిఫ్ట్ ఇవ్వరు. హీరోకి ఎదురుగా ఒక కారు ఆగుతుంది. ఆ కారులో హీరోయిన్ ఒకరితో గొడవపడి దిగుతుంది. హీరో అక్కడికి వెళ్లి ఏమైందని అడుగుతాడు. గొడవపడ్డ వ్యక్తి అక్కడినుంచి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ హీరోతో అతడు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. నా తల్లిదండ్రులు చనిపోవడంతో, బాయ్ ఫ్రెండ్ తో జీవితం గడపాలనుకున్నానని చెప్తుంది. అయితే అతడు తల్లిదండ్రులు నాకు ముఖ్యమని వెళ్లిపోతున్నాడని బాధపడుతుంది. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తుండ గా కారులో ఒక జంట వీళ్ళకు లిఫ్ట్ ఇస్తుంది. వీళ్ళని వాళ్ళ ఇంటికి డిన్నర్ కి ఆహ్వానిస్తారు. ఆ ఇంటికి వెళ్ళాక హీరోకి వాళ్ళిద్దరి పైన అనుమానం వస్తుంది. వీళ్ళిద్దరూ ఒకే రూమ్ లో ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తారు. రాత్రి పడుకున్నాక పొద్దున లేచి చూసేసరికి హీరో పక్కన హీరోయిన్ కనిపించదు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఒక లెటర్ ఇచ్చి వెళ్లిపోయిందని చెప్తారు.

అయితే అందులో ఉన్న రైటింగ్ హీరోయిన్ ది కాదని తెలుసుకుంటాడు హీరో. వీళ్ళ మీద అనుమానం వచ్చి వెనక తిరిగి చూసేసరికి అతనికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అతనిని చంపడానికి చూస్తారు. అయితే అక్కడ నుంచి తప్పించుకొని హీరోయిన్ ని కనుక్కొని ఆమెను  తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సైకోలు వెంబడించి వీళ్ళ కారును ఢీ కొడతారు. మళ్లీ వీళ్లిద్దరిని తీసుకొని చంపాలని చూస్తారు. హీరోయిన్ అక్కడున్న ఒక వ్యక్తిని చంపేస్తుంది. అప్పుడు హీరోకి దిమ్మతిరిగే ట్విస్ట్  ఎదురవుతుంది. ఆ సైకో కిల్లర్ ఎవరో తెలిసి ఆశ్చర్యపోతాడు. ఆ సైకో కిల్లర్ ఎవరో కాదు హీరోయిన్. ఆ జంట ఎవరో కాదు హీరోయిన్ తల్లిదండ్రులు. చివరికి హీరోయిన్, హీరోని చంపుతుందా? హీరోయిన్ ఆ దారిలో ఎంతమందిని చంపుతుంది? ఈ విషయం పోలీసులకు తెలుస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సైకో కిల్లర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×