OTT Movie : హర్రర్ థ్రిల్లర్ సినిమాలు కొన్ని రొటీన్ గా ఉంటాయి. కొత్తగా ఇంట్లోకి వెళ్లే ఫ్యామిలీలకు ఆ ఇంట్లో దయ్యాలు ఉంటాయనే విషయం తెలియక వెళ్తారు. ఆ తర్వాత ఆ దయ్యాలతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎక్కువగా ఇలాంటి హర్రర్ రొటీన్ సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హర్రర్ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాని రాత్రి పూట ఒంటరిగా చూస్తే అంతే సంగతులు. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
రెండు ఓటిటి లలో
ఈ హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘స్వీట్ రివర్‘ (Sweet river). ఈ మూవీలో సైకో కిల్లర్ చేతిలో చనిపోయిన తన బిడ్డ బాడీని వెతుక్కునే క్రమంలో తల్లి ఫేస్ చేసే సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీలో కొన్ని సన్నివేశాలు రాత్రిపూట చూడాలంటే పై ప్రాణాలు పైకే పోతాయి. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), నెట్ ఫ్లిక్స్ (Netflix) లలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హనా అనే మహిళ లిఫ్టన్ అనే వ్యక్తి దగ్గర స్టే చేయడానికి ఒక గ్యారేజ్ ను అద్దెకు తీసుకుంటుంది. అదే రోజు లిఫ్టన్ ను ఒక చెరుకు తోటలోకి ఆత్మ లాక్కెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు లిఫ్టన్ చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత హనా ఇదివరకే సైకో కిల్లర్ చేతిలో చనిపోయిన, తన బిడ్డ బాడీని వెతుకుతూ ఉంటుంది. ఒక సైకో కిల్లర్ కి పిల్లలు అంటే పడకపోవడంతో, చాలామంది పిల్లల్ని చంపి ఉంటాడు. అందులో భాగంగానే హనా కొడుకుని కూడా చంపి ఉంటాడు సైకో కిల్లర్. అయితే పోలీసులకు దొరికిపోతానేమో అని, ఆ సైకో కిల్లర్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉంటాడు. హనా స్టే చేసిన గ్యారేజ్ పక్కన జాన్, ఎలి మోర్ అనే జంట ఉంటారు. వీరి అమ్మాయి కూడా సైకో కిల్లర్ చేతిలో చనిపోయి ఉంటుంది. అయితే రాత్రిపూట ఆ చెరుకు తోట పక్కనే ఉండే నదిలో, ఆ పిల్లల ఆత్మలు కనపడుతూ ఉంటాయి.
ఒకరోజు చనిపోయిన కూతురు ఆత్మతో జాన్, ఎలి మోర్ జంట నది దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న హనా అక్కడికి వెళుతుంది. ఆమెకు అక్కడున్న ఒక ఆత్మ, చనిపోయిన ఆమె బిడ్డ బాడీ ఎక్కడ ఉందో చెబుతుంది. అక్కడికి సైకో కిల్లర్ ఆత్మ కూడా రావడంతో, అక్కడినుంచి భయపడి వెళ్ళిపోతుంది. చివరికి చనిపోయిన తన బిడ్డ బాడీ ఆమెకు దొరుకుతుందా? ఆత్మలు రాత్రిపూట ఎందుకు కనపడుతున్నాయి? సైకో కిల్లర్ ఆత్మ హనాను ఏమైనా చేస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) నెట్ ఫ్లిక్స్ (Netflix) లలో స్ట్రీమింగ్ అవుతున్న ‘స్వీట్ రివర్’ (sweet river) హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.